Anant Ambani – Radhika Merchant Wedding : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ఇండియా నుంచే కాదు, వరల్డ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. పెళ్లికి ముందు రెండు సార్లు ప్రీ – వెడ్డింగ్ పార్టీలు జరిపారు. పెళ్లికి సెలబ్రిటీలు రావడం ఓ ఎత్తు అయితే, వచ్చిన సెలబ్రిటీలు అందరూ రాధికా మర్చంట్, అనంత్ అంబానీ పెళ్లి గురించి ఎమోషనల్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..
పెళ్లికి వచ్చినందుకు ఈ సెలబ్రిటీలకు కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చింది అంబానీ ఫ్యామిలీ. అయితే ఇలా సోషల్ మీడియాలో పెళ్లి గురించి పోస్ట్ చేసినందుకు కూడా భారీగా ముట్టుజెప్పారు. అందుకే ప్రపంచం మునిగిపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయని ధోనీ కూడా అంబానీ పెళ్లి గురించి ఎమోషనల్గా పోస్టులు చేశాడు.. మహేష్, హార్ధిక్, కిమ్ కర్దాషియన్.. ఇలా హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ పెళ్లి గురించి పోస్టులు చేశారు..
Matrimonial Frauds : ‘A Growing Concern in Contemporary Society’ : గాలం వేసిన పెళ్లి..
వందల కోట్లు ఖర్చు పెట్టి, ఇంత హంగామా చేస్తూ పెళ్లి చేసుకోవడం వల్ల ఒరిగిందేటీ? అంబానీ ఇలా తన ఆస్తిలో రూ.2 వేల కోట్లు పెళ్లికి వృథా ఖర్చుగా తగిలేశారంటూ చాలా మంది అనుకున్నారు. కానీ ఈ పెళ్లి వెనక చాలా పెద్ద వ్యాపార తతంగమే సాగింది. పెళ్లిలో రాధికా వేసుకున్న చీర ఇంత? ఆమె వేసుకున్న నెక్లెస్ ఇంత? ఆమె చీరను బంగారంతో చేశారు? ఇలా గత వారం రోజులుగా ఈ పెళ్లి గురించే చర్చ జరుగుతూ వస్తోంది..
ఈ చర్చ వల్ల స్టాక్ మార్కెట్లో రిలయెన్స్ షేర్లు 5 శాతం పెరిగాయి. ఇంకా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. అలాగే పెళ్లికి ఇంత ఖర్చు చేశారని చెప్పడం వల్ల వాళ్ల దగ్గర ఇంకెంత ఉందో అని ప్రపంచమంతా చర్చించుకుంది. ఈ విధంగా రిలయెన్స్ బ్రాండ్ మార్కెట్ మరింత విస్తరించింది. ప్రపంచ దేశాల్లో రిలయెన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరించేందుకు ఈ పెళ్లిని వాడుకుంది అంబానీ ఫ్యామిలీ..
పెళ్లి పేరుతో జీవితాన్ని బేరం పెడుతున్నారా..!?
పెళ్లి హడావుడిలో ఉండగానే జియో రేట్లు పెరిగాయి. ఆదాయం పెరిగింది. అంబానీ కుటుంబం ఈ వారంలో ఖర్చు చేసిన మొత్తం కంటే వారి ఆస్తి పెరిగిన శాతమే ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి తెలిసింది ఏంటయ్యా అంటే ఇన్నాళ్లు మనం చూసింది మ్యారేజ్ కాదు, అది బిజినెస్ ఈవెంట్..