Raksha Bandhan 2024 : అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా రాఖీ పండగ జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంగ్లీషోడు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, బ్రదర్ డే, బామ్మర్ది డే అని రకరకాల డేస్ జరిపినట్టుగా ఇలాంటివి హిందూ సంప్రదాయంలో ఉండవు. మరి సోదర సోదరీమణుల కోసం ప్రత్యేకంగా రాఖీ పండగ ఎందుకు ఉన్నట్టు? దీని వెనక కథ ఏంటి..
కృష్ణా దౌప్రదీల కథ..
శ్రీకృష్ణుడి, రుక్మిణికి ఎంతో ఇష్టమైన చెరుకుని విరగ్గొడుతుంటే ఆయన చిటికెన వేలికి గాయమైంది. కృష్ణుడి చేతి వెంట రక్తం కారిపోతుంటే కంగారు పడిన రుక్మిణి, తన పనివారిని తక్షణమే వైద్యుడిని పిలుచుకురమ్మని పురమాయించింది. అయితే అక్కడే ఉన్న కృష్ణుడి చెల్లెలు దౌప్రది, తన చీర కొంగుని చించి.. అన్న వేలికి కట్టుగా కట్టింది.
Arunachalam Temple : అరుణాచలం ఆలయ విశిష్టత..
చెల్లెలి ప్రేమకు ముగ్దుడైన శ్రీకృష్ణుడు, ఆమెకు ఏ ఆపద కలిగినా తలిచిన వెంటనే ప్రత్యక్షమై ఆదుకుంటానని వరమిచ్చాడు. ఈ కారణంగానే దౌప్రది వస్త్రాపహరణం సమయంలో అన్నను తలుచుకోగానే, శ్రీకృష్ణుడు చీరలు పంపించాడు. దీని నుంచి రాఖీ పండగ పుట్టుకొచ్చిందని కొందరి భావన. అందుకే సోదరుడికి సోదరి రాఖీ కడితే, బదులుగా ఆమెకు చీర కొనివ్వాలనేది ఆచారంగా మారింది.
హ్యూమాయున్ – కర్ణవతి బంధం..
రాఖీ వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మేవర్ రాజ్యాన్ని పాలించిన రాణా సంగ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అతని భార్య కర్ణవతి రాజ్యపాలన బాధ్యతలను తీసుకుంది. ఓ మహిళకు రాజ్యపాలన ఇవ్వడం శాసన సమ్మతం కాకపోవడంతో తన పెద్ద కొడుకు విక్రమ్జీత్ని నామమత్రపు రాజుగా చేసి, కర్ణవతి కన్నుసన్నల్లో పాలన సాగేది. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ బాద్షా బహదూర్ షా.. మేవర్ రాజ్యంపై దండెత్తాడు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కర్ణవతి, తన పొరుగు రాజ్యానికి అధిపతి ఉన్న హ్యూమాయున్ని సాయం కోరుతూ లేఖ పంపింది. ఈ లేఖతో పాటు రాఖీని కూడా హ్యూమాయున్ని పంపింది కర్ణవతి. ఆ సమయంలో మిలిటరీ క్యాంపులో ఉన్న హ్యూమాయున్.. మేవర్ రాజ్యాన్ని కాపాడేందుకు తన సైన్యంతో తరలివచ్చాడు.
Swarnagiri Temple : తెలంగాణ తిరుపతి..
అయితే హ్యూమాయున్ వచ్చేసరికి కర్ణవతి సైన్యం, బహదూర్ షా సైన్యం చేతిలో ఓడిపోయింది. ఆలస్యంగా వచ్చినా తన సైన్యంతో బహుదూర్ షా సైన్యాన్ని ఓడించిన హ్యూమాయున్, విక్రమ్జీత్కి తన రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. అలా కుల మతాలకు అతీతంగా రాఖీ పండగ జరుపుకోవడం మొదలైంది. అలాగే గణపతి సోదరి సంతోషి మాత పుట్టినరోజు కూడా కావడంతో రాఖీ పండగకు హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది.