SKY is High: మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ సూర్య క్యాచ్..

SKY is High
SKY is High

SKY is High : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో భారత జట్టు 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాని ఓడించింది. 2007 తర్వాత 17 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. 5 ఓవర్లలో 31 పరుగులు చేస్తే సౌతాఫ్రికా గెలిచేది. ఇక టీమిండియా ఓడిపోయిందని చాలామంది టీవీలు, ఫోన్లు కట్టేసి పడుకున్నారు. అయితే ఇక్కడి నుంచే భారత జట్టు మ్యాజిక్ చేసింది. క్లాసిన్‌ 16వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అయితే భారత జట్టు అభిమానులకు ఇంకా నమ్మకం రాలేదు.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయం

ఎందుకంటే క్రీజులో కిల్లర్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉంటే సౌతాఫ్రికా విజయం ఖాయం. అనుకున్నట్టే 20వ ఓవర్‌ మొదటి బంతికి ఓ పెద్ద షాట్ ఆడాడు డేవిడ్ మిల్లర్. అది గాల్లోకి లేచి, అలా బౌండరీ అవతల పడేందుకు దూసుకెళ్లింది. ఒక్క క్షణం టీమిండియా ఫ్యాన్స్ గుండె ఆగినంత పనైంది. బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ ఓ సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్..

Virat Kohli – Rohit Sharma : ఓ శకం ముగిసింది..

ఈ క్యాచ్ మ్యాచ్‌కి అసలు సిసలైన టర్నింగ్ పాయింట్. సూర్య క్యాచ్ మిస్ చేసి ఉంటే, ఆ బంతికి సిక్సర్ వచ్చి ఉండేది. ఇక 5 బాల్స్‌లో 10 రన్స్ చేస్తే చాలు. మిల్లర్ ఈజీగా కొట్టేసేవాడు. అందుకే బౌండరీ లైన్ దగ్గర బాడీని బ్యాలెన్స్ చేస్తూ సూర్య పట్టిన క్యాచే, టీమిండియాకి వరల్డ్ కప్ అందించింది.. బ్యాటింగ్‌లో ఫెయిల్ అయినా, అవసరమైన సమయంలో అద్భుతమైన క్యాచ్ పట్టి, తనను తిట్టినవారితోనే పొగిడించుకున్నాడు సూర్య భాయ్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post