Most Memorable Month 2024 : తెలుగువారికి 2024 జూన్ నెల మరిచిపోలేని మధుర అనుభూతులను మిగిల్చింది. జూన్ 4న వెలువడిన ఏపీ ఎన్నికల్లో తెలుగువారి ఫెవరెట్ నటుల్లో ఒకడైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఘన విజయం అందుకున్నాడు. పోటీ చేసిన 21 ప్రాంతాల్లోనూ జనసేన పార్టీ అద్భుత విజయం అందుకుంది. ఈ విజయంతో మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తెలుగు సినిమా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు..
ఆ తర్వాత జూన్ 27న ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki 2898AD) సినిమా విడుదలైంది. చాలారోజుల తర్వాత ప్రభాస్ (Prabhas) సినిమాకి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది. ‘సలార్’ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చినా, మిక్స్డ్ టాక్‌తో లాభాలు రాలేదు. ‘కల్కి 2898AD’ సినీ జనాల ప్రశంసలు దక్కించుకుంది. హాలీవుడ్ రేంజ్ బొమ్మ తీశారంటూ నాగ్ అశ్విన్‌ని ఆకాశానికి ఎత్తేశారు సినీ దిగ్గజాలు. ఈ సినిమా సక్సెస్‌తో భారతీయ సినిమా, తెలుగు సినిమా ఖ్యాతి మరింత ఎత్తుకు ఎదిగింది..
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
రెండు రోజుల తర్వాత జూన్ 29న టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) టోర్నీమెంట్ విజేతగా నిలిచింది భారత జట్టు. ఈ సక్సెస్‌తో తెలుగువాళ్లతో పాటు భారతీయులు అందరూ పులకించిపోయారు. ఒకే నెలలో తెలుగువారికి మూడు సంతోషకరమైన వార్తలు వచ్చాయి. దీంతో ఈ మధ్యకాలంలో తెలుగువారి మదిలో చిరకాలం గుర్తుండిపోయే నెలగా నిలిచిపోయింది 2024, జూన్ నెల…