Maharaja Movie : డబ్బింగ్ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు..

Maharaja Movie Review
Maharaja Movie Review

Maharaja Movie : విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా ‘మహారాజ’, అదిరిపోయే రివ్యూలు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ‘మహారాజ’ మూవీ అని చెబుతున్నారు సినీ జనాలు. రివ్యూలకు తగ్గట్టుగానే జనాల నుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇకపై ఈ సినిమాకి వచ్చే వసూళ్లన్నీ కూడా లాభాల కిందే లెక్క.

మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించింది ‘మహారాజ’.. గత శుక్రవారం రిలీజైన సుధీర్ బాబు ‘హరోంహర’ మూవీకి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయితే ‘మహారాజ’ మూవీతో పోలిస్తే ‘హరోం హర’ మూవీకి కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి.

Vijay Sethupathi – Trisha : క్లైమాక్స్‌లో త్రిషతో లిప్‌లాక్ రాసుకున్న డైరెక్టర్.. హీరో ఏం చేశాడంటే..

మూడు రోజుల్లో ‘హరోం హర’ సినిమా రూ.4 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. చాలారోజుల తర్వాత సుధీర్‌ బాబు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ‘మహారాజ’ టాక్‌, ‘హరోం హర’ కంటే చాలా బాగుండడంతో సుధీర్ బాబు సినిమా కలెక్షన్లు రాబట్టడంలో వెనకబడింది. ఈ రెండు సినిమాలతో రిలీజైన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post