Balakrishna – Namitha : తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నమిత, కోలీవుడ్‌కి వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. భారీగా బరువు పెరిగిపోయి, గ్లామర్ రోల్స్ చేస్తూ వరుస సినిమాలు చేసింది. నమితకి తమిళనాడులో గుడి కూడా కట్టారు. తెలుగులో వెంకటేశ్, రవితేజ, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించిన నమిత, కోలీవుడ్‌కి వెళ్లక ముందు బాలకృష్ణతో నటించే ఛాన్స్‌ని మిస్ చేసుకుంది..
తమిళ్లో సూపర్ హిట్టైన ‘సామి’ సినిమాని తెలుగులో ‘లక్ష్మీ నరసింహా’ పేరుతో రీమేక్ చేశాడు జయంత్ సి పరాంజీ. ఈ సినిమాలో అసిన్ హీరోయిన్గా నటించింది. మలయాళ సినిమాతో తెరంగ్రేటం చేసిన అసిన్, తెలుగులో ‘అమ్మానాన్నఓ తమిళమ్మాయి’ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహా’, ‘ఘర్షణ’, ‘చక్రం’ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా మారింది..
బాలకృష్ణ మూవీ షూటింగ్లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..
వాస్తవానికి ‘లక్ష్మీ నరసింహా’ సినిమాలో హీరోయిన్గా నమితనే అనుకున్నారు. అయితే బాలకృష్ణతో సినిమా అంటే చాలా ఇబ్బందులు వస్తాయని కొందరు చెప్పడంతో ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట నమిత. దీంతో ఆ ఛాన్స్, అసిన్‌కి దక్కింది. అసిన్ ఖాతాలో వరుస హిట్లు పడి, బిజీ హీరోయిన్గా మారడానికి ఉపయోగపడింది. అలా మిస్ అయినా ‘సింహా’ సినిమాలో బాలయ్యతో కలిసి నటించింది నమిత. అప్పటికే నమితకి హీరోయిన్ ఛాన్సులు తక్కువైపోయాయి. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన నమిత, భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో బిజీగా గడుపుతోంది..