Ram Charan Game Changer : ‘RRR’ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది. ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చేయకముందే ‘గేమ్ ఛేంజర్’ మూవీని మొదలెట్టాడు శంకర్. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుందట.
ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ ‘పుష్ప’, ప్రభాస్ ‘కల్కి, ‘సలార్’ ఇలా ప్రతీ స్టార్ హీరో సినిమా కూడా రెండు పార్టులుగా వస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి సినిమా కూడా రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందని టాక్. ‘గేమ్ ఛేంజర్’ మూవీ కథను చెప్పడానికి 3 గంటలు సరిపోవడానికి ఫీలైన శంకర్, రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. దీని కోసం కథలో కొన్ని మార్పులు కూడా చేసినట్టు టాక్..
Ram Charan Birthday Special : వినయ విధేయ రాముడు..
‘భారతీయుడు 2’ మూవీతో పాటు ‘భారతీయుడు 3’ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాడు. పార్ట్ 3 షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యిందని టాక్. దీంతో ‘భారతీయుడు 2, ‘భారతీయుడు 3’ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ‘గేమ్ ఛేంజర్ 2’ మూవీ సెట్స్‌పైకి వెళ్తుంది.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రొబో’ సినిమాకి సీక్వెల్‌గా ‘2.0’ వచ్చింది. ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ ఇప్పుడు వస్తోంది.