FIFA WC qualifier : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్ లో భారత్ పోరు ముగిసింది. దోహాలో జరిగిన తమ చివరి గ్రూప్ ఏ మ్యాచ్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ నుండి నిష్క్రమించింది. అయితే ఈ నిష్క్రమణ హృదయ విదారకంగా ముగిసింది. రిఫరీల తప్పుడు నిర్ణయానికి భారత్ బలైంది.
ఆటలో ఎక్కువ భాగం భారత్ ఆధిపత్యం చెలాయించింది, కానీ చివరి 15 నిమిషాల్లో వారికి వ్యతిరేకంగా పరిస్థితులు మొదలయ్యాయి. వివాదాస్పద గోల్ ఖతార్‌ను సమం చేయడానికి అనుమతించింది. 10 నిమిషాల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగానే, వారు ఆధిక్యంలోకి వచ్చారు.
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..
37వ నిమిషంలో లాల్లియాన్జువాలా చాంగ్టే చేసిన గోల్ ద్వారా భారత్ ఆధిక్యం సాధించింది. అయితే, బంతి ఆట మధ్యలో గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపించినప్పటికీ రిఫరీ యూసుఫ్ ఐమెన్ గోల్ ను అనుమతించడంతో వివాదం చెలరేగింది.
భారత ఆటగాళ్లు రిఫరీతో వాదించినా నిర్ణయాన్ని తోసిపుచ్చలేదు. అప్పటికి స్కోర్ 1-1 తో సమంగా ఉంది. రిఫరీ తప్పుడు నిర్ణయానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
We’ll leave it here!#INDQAT #IndianFootball pic.twitter.com/5KhtyOfrvS
— FanCode (@FanCode) June 11, 2024