Afghanistan vs Bangladesh : వెస్టిండీస్‌లో జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాని ఓడించిన ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్‌పై 8 పరుగుల తేడాతో గెలిచి, సెమీ ఫైనల్‌కి చేరుకుంది. ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్, సెమీస్ దాకా రావడం ఇదే తొలిసారి.
సెయింట్ వెన్సెట్లో జరిగిన మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడి, ఆగుతూ ఉండడంతో ప్లేయర్లు, పెవిలియన్‌కి, గ్రౌండ్‌కి తిరుగడంతోనే టైమ్ అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, 20 ఓవర్లు ఆడి 115 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్భజ్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు..
Ind vs Pak : పాకిస్తాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ..
120 బంతుల్లో 116 పరుగుల టార్గెట్ ఛేజ్ చేస్తూ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా టీమ్‌లో కూడా ఓపెనర్ లిట్టన్ దాస్ 54 పరుగులు చేసి ఒంటరిగా పోరాడాడు. అయితే అతనికి సరైన సపోర్ట్ దక్కకపోవడంతో బంగ్లాదేశ్ ఓడక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే ఆస్ట్రేలియా, సెమీ ఫైనల్‌కి వెళ్లి ఉండేది. అయితే ఆసీస్ టీమ్‌కి, బంగ్లా టీమ్‌కి షాక్ ఇచ్చి మొట్టమొదటిసారి సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది ఆఫ్ఘాన్..
జూన్ 26న దక్షిణాఫ్రికా జట్టుతో ఆఫ్ఘనిస్తాన్, జూన్ 27న భారత జట్టుతో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్స్ ఆడతాయి.