Ramoji Rao : మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన, జూన్ 8న తెల్లవారుజామున మరణించినట్టు వైద్యులు తెలియచేశారు. రామోజీ రావు, తెలుగు మీడియా రంగంలో దిగ్గజంగా ఎదిగారు. ఇండియాలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ, ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ని ఏర్పాటు చేసిన రామోజీ రావు, ఈనాడు పేపర్, ఈటీవీ నెట్‌వర్క్‌లను స్థాపించారు. అలాగే మార్గదర్శి ఛిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్‌తో పాటు రమాదేవీ పబ్లిక్ స్కూల్, ఉషా కిరణ్ మూవీస్, డాల్ఫిన్ హోటల్స్‌కి అధిపతిగా ఉన్నారు రామోజీ రావు..
Narendra Modi : మూడోసారి మోడీకి పట్టాభిషేకం.. చంద్రబాబు డిమాండ్స్ ఏంటంటే..
నిర్మాతగా 90కి పైగా సినిమాలు నిర్మించిన రామోజీ రావు, ‘సుదాచంద్రన్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మయూరి’, పరుగుల రాణి అశ్వినా నాచప్ప జీవత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘అశ్విని’, విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘ప్రతిఘటన’ వంటి ఎంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు.
ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమైన ‘చిత్రం’ నిర్మాత రామోజీరావే. అలాగే తేజ, ఉదయ్ కిరణ్ కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘నువ్వేకావాలి’ నిర్మాత కూడా ఆయనే. తరుణ్‌కి కెరీర్ బెస్ట్ హిట్టు ‘నువ్వేకావాలి’ ఇచ్చిన రామోజీ రావు, ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేశాడు. అలాగే ‘ఆనందం’ సినిమాతో ఆకాశ్‌ని, ‘ఇష్టం’ సినిమాతో శ్రియా శరణ్, ‘నీతో’ సినిమాతో కె.రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాశ్‌ని పరిచయం చేశాడు. కళ్యాణ్ రామ్ మొదటి సినిమా ‘తొలిచూపులోనే’, నిర్మాతగా రామోజీరావుకి 75వ సినిమా..
Jr NTR : మామయ్యకి, బాబాయికి, అత్తలకు.. తారక్ ఎంత పొడుగు ట్వీట్ వేసినా..
2016లో ‘పద్మవిభూషణ్’ అవార్డు అందుకున్న రామోజీరావు, నిర్మాతగా ఐదు నంది అవార్డులు అందుకున్నారు. రామోజీరావు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.