అనుష్కకి ముద్దు, సచిన్‌కి అభివాదం, తండ్రిని గుర్తు చేసుకుంటూ.. విరాట్ కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌‌కి..

Virat Kohli : ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కి వెళ్లింది. ముంబైలో జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, వన్డే కెరీర్‌లో 50 సెంచరీలు అందుకున్నాడు.

ముంబైలో ‘మాస్టర్’ రికార్డులు బ్రేక్..

ఈ సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ తన సెలబ్రేషన్స్‌తో అందరినీ కవర్ చేసేశాడు. సెంచరీ తర్వాత బ్యాటు పైకి లేపి ఆకాశంలోకి చూస్తూ, మెడలో ఉన్న లాకెట్‌ని ముద్దు ఆడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

Virat Kohli

ఆ తర్వాత వీఐపీ పొడియంలో ఉన్న తన రోల్ మోడల్, తన హీరో సచిన్ టెండూల్కర్‌కి తల వంచి అభివాదం చేశాడు విరాట్. అలాగే స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న తన భార్య అనుష్క శర్మకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. బదులుగా అనుష్క కూడా గాల్లో ముద్దులు పంపింది.

Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..

‘నా కెరీర్‌ని ఒక్క ఫ్రేమ్‌లో బంధించాలంటే ఇంతకంటే గొప్ప దృశ్యం ఏముంటుంది. నా హీరో సచిన్ టెండూల్కర్ ఇక్కడే ఉన్నాడు. నా రోల్ మోడల్ వీవ్ రిచర్డ్స్ ఇక్కడే ఉన్నారు. అనుష్క ఇక్కడే ఉంది. ఈ మూమెంట్ చాలా చాలా స్పెషల్’ అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post