Daggubati Purandeswari : ఎన్టీఆర్… తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా నాయకుడు. ఎన్నో సంక్షేమ పథకాలతో తెలుగువారితో దేవుడిగా కీర్తించబడిన ముఖ్యమంత్రి. అలాగే ఎన్టీఆర్‌కి తను కన్నవారే వెన్నుపోటు పొడిచారు.
లక్ష్మీపార్వతి చేతుల్లోకి పార్టీ వెళ్లిపోతుందని, ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడానికి ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు వేశారు. వైశ్రాయ్ హోటల్ సంఘటన, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేరు..
ఈ సంఘటనపై ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి మాట్లాడారు. ‘వైశ్రాయ్ హోటల్ సంఘటన తర్వాత నాన్నని కలవకుండా ఉండలేకపోయాను. ఆయన కొట్టినా పర్లేదు, వెళ్లి కలవాలని అనుకున్నాను. తమ్ముడు బాలకృష్ణ, నాన్నగారు కోపంగా ఉన్నారు, ఇప్పుడు వద్దని చెప్పినా వినకుండా వెళ్లాను.
తమ్ముడు బయట కూర్చోన్నాడు. నేను లోపలికి వెళ్లాను.. బాలయ్యబాబు చెప్పినట్టు, నాన్నగారు నన్ను కొట్టినా, కోపడ్డినా నేను పెద్దగా బాధపడేదాన్ని కాదు..
‘ముసలాడి పళ్లు విరగ్గొట్టడానికి అందరూ చేతులు కలిపారు’ అంటూ ఇంగ్లీషులో అన్నారు. ఆ మాట ఇప్పటికీ నన్ను ఎంతో బాధపెడుతుంది. వెన్నుపోటు రాజకీయం నిజమే. అక్కడ జరిగింది ఏంటి? అనేది అందరికీ తెలుసు.
Sr NTR Vardhanthi : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..
చరిత్ర దాయాలనుకున్నా దాగదు. మా ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వైశ్రాయ్ హోటల్ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉండకంటే బాగుండని చాలా సార్లు ఫీల్ అయ్యారు.. నేను చేసింది తప్పని ప్రశ్చాతాపపడ్డారు… అది నాకు సంతోషం కలిగించే విషయం..
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాన్న గారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఆయన నమ్మిన సిద్ధాంతం.. ’ అంటూ చెప్పుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి..