Crew Movie Review : గ్లామర్, కామెడీ, పక్కా బాలీవుడ్ మసాలా..

Crew Movie Review : కరీనా కపూర్, కృతి సనన్, టబు ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘Crew’. రాజేశ్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 29న విడుదల అయ్యింది. ఈ సినిమా బాలీవుడ్‌కి హిట్టు ఇచ్చినట్టేనా… ఎయిర్ హోస్టర్స్‌గా పనిచేసే కరీనా, కృతి, టబు.. ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. అనుకోకుండా ఓ ప్రయాణీకుడు, విమానంలో చనిపోవడం, అతను కస్టమ్స్ అధికారులకు తెలియకుండా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఈ ముగ్గురు ఎయిర్ హోస్టర్లకు తెలుస్తోంది. ఆ బంగారాన్ని కాజేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఫేస్ చేశారు… అనేదే Crew కథ..

Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..

ఈ సినిమాకి ప్రధాన బలం కరీనా కపూర్, కృతి సనన్, టబు యాక్టింగ్. ముగ్గురూ తమ యాక్టింగ్‌తో చించేశారు. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్, భలేగా పేలాయి. గ్లామర్ విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా చూపించారు. కామెడీ, ఎమోషన్స్, డ్రామా మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ రాజేశ్ కృష్ణన్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

రెగ్యూలర్ బాలీవుడ్ స్టైల్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది. అయితే కొత్తదనం కోరుకునేవారికి ఇందులో పెద్దగా నచ్చే అంశాలు లేవు. ఎయిర్ హోస్టర్స్‌గా పనిచేసే సిబ్బంది కష్టాలను కామెడీగా చూపించాలనే ప్రయత్నం బాగుంది. ఆ మధ్య ఓ బాలీవుడ్ డైరెక్టర్, ఇండియాలో 90 శాతం మంది విమానం ఎక్కలేదు, అందుకే వాళ్లకు నా ఫైటర్ మూవీ నచ్చలేదు అన్నాడు… Crew విషయంలో అలాంటి సమస్య అవసరం లేదు. విమానం కాదు కదా, కనీసం బస్సు ఎక్కని వాళ్లకు కూడా ఈ మూవీ అర్థం అవుతుంది. డార్క్ కామెడీ మూవీ కావడంతో అందరికీ నచ్చాలని లేదు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post