Anupama Parameswaran : సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి పద్ధతైన పాత్రల్లోనే కనిపించింది అనుపమ పరమేశ్వరన్. అలాంటి కొన్నాళ్లుగా అను సెలక్ట్ చేస్తున్న సినిమాలు, ఆమె ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్, ‘టిల్లు స్క్వైర్’ సినిమాలో అయితే రెచ్చిపోయి నటించినట్టు టీజర్, ట్రైలర్, పోస్టర్లలో తెలుస్తోంది.
పద్ధతిగా ఉండే అనుపమ, ఈ రేంజ్లో రెచ్చిపోవడం చూసి ఫ్యాన్స్ బాగా హార్ట్ అవుతున్నారు కూడా. తాజాగా రొమాంటిక్ సీన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది అనుపమ.. ‘హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ చూసి జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ రొమాన్స్ చేయడం చాలా కష్టం.. ప్రైవేట్ స్పేస్‌లో చేయాల్సింది, 100 మంది ముందు చేయాల్సి వస్తుంది.
Tillu Square Review : సిద్ధూ క్రేజీ షో! కానీ కొత్తదనం మిస్సింగ్..
ఆడియెన్స్ కోసం కొన్ని చేయక తప్పదు. మిగిలిన సీన్స్ కంటే రొమాంటిక్ సీన్స్ చేయడమే చాలా కష్టం.. అందరూ చూస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాలి..’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వైర్’ రిలీజ్ తర్వాత అనుపమ 2.0 వర్షన్ చూస్తారని, ఇకపై గ్లామరస్ రోల్స్‌లో రెచ్చిపోతానని చెప్పకనే చెప్పేసింది ఈ ఉప్మా బేబీ..