ఆడు జీవితం The Goat Life Review : ‘సలార్’ మూవీలో ప్రభాస్ స్నేహితుడు, వరదరాజ్ మున్నార్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ‘ఆడు జీవితం the Goat life’ మూవీ, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల అయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి అంచనాలు పెంచేసిన ఈ మూవీని దాదాపు 16 ఏళ్లు తెరకెక్కించారు. అనేక ఇబ్బందులు, అవాంతరాలు ఫేస్ చేసిన ఈ మూవీ యూనిట్, థార్ ఎడారిలో మండుటెండలో షూటింగ్ చేసింది.
Prithviraj Sukumaran : బాలయ్యతో సినిమా చేస్తా! కథ కూడా రెఢీ చేసుకున్నా..
బతకుతెరువు కోసం అరబ్ దేశానికి వెళ్లిన నజీబ్, అక్కడికి వెళ్లిన తర్వాత తనను ఏజెంట్, వెట్టిచాకిరికి అమ్మేసినట్టు తెలుసుకుంటాడు. మరో మనిషి కానరాని ఎడారిలో నజీబ్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు? బానిసత్వపు కొరల్లో అతను ఎలాంటి కష్టాలు అనుభవించాడు. ఇదే ‘ఆడు జీవితం’ సినిమా కథ.. నజీబ్ మహమ్మద్ అనే కేరళ యువకుడు నిజంగా ఫేస్ చేసిన అనుభవాలనే నవలగా, ఆ తర్వాత సినిమాగా తీసుకొచ్చారు.
హార్డ్ రియాలిటీని చూపించేందుకు పృథ్వీరాజ్, దర్శకుడు బెల్లీ పడిన కష్టం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూడగలిగే కొన్ని సీన్స్, ‘ఆడు జీవితం’ మూవీలో కనిపించి, మనసుల్ని పిండేస్తాయి. నజీబ్ భార్య అమలాపాల్ తన పాత్రలో చక్కగా నటించింది. హార్ట్ టచ్చింగ్ డ్రామాలో ఆమె గ్లామర్ ప్రేక్షకులకు కాస్త ఊరటనిస్తుంది.
Prithviraj Sukumaran : మెగాస్టార్ స్వయంగా అడిగినా చేయనని చెప్పేశా..
ఏఆర్ రెహ్మాన్ మరోసారి థియేటర్‌లో కూర్చొన్న ప్రతీ ప్రేక్షకుడిని కథలో లీనం అయ్యేలా చేశాడు. మొత్తానికి ‘ఆడుజీవితం’ మూవీ త్రీ మ్యాన్ షో. నటుడిగా పృథ్వీరాజ్ సుకుమార్, ఈ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టేయడం గ్యారెంటీ. అలాగే దర్శకుడు బ్లెస్సీ టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఏఆర్ రెహ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సునీల్ సినిమాటోగ్రఫీ… కలిసి ‘ఆడుజీవితం’ మూవీని మాస్టర్ పీస్‌గా మలిచాయి.. అయితే ఆరు పాటలు, మూడు ఫైట్లు, పంచ్ డైలాగులు, అడల్ట్ కామెడీ సీన్స్ ఆశించేవారికి మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో అలాంటివేమీ ఉండవు.. రీల్‌పైన రియాలిటీని కోరుకునేవారికి మాత్రం ‘ఆడు జీవితం’ పర్ఫెక్ట్ ఛాయిస్..