YS Jagan : జగన్ చెప్పిందెన్ని? చేసిందెన్ని?

YS Jagan : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చెప్పిన మాట ఏపీ ప్రజలకి గుర్తు ఉండే ఉంటుంది. ‘నా కులం మాట ఇస్తే తప్పని కులం, నా మతం మానవత్వం’ అంటూ చాలా పెద్ద మాటలే చెప్పాడు. అయితే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరాయి.

ప్రభుత్వ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన cps పెన్షన్ విధానం రద్దు చేస్తానని మాట ఇచ్చాడు జగన్. అయితే అది జరగలేదు. చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం తేలేకపోయిన ప్రత్యేక హోదాను తాను తెస్తామని ఏపీ ప్రజలను నమ్మించాడు జగన్. అయితే ఐదేళ్లలో ప్రత్యేక హోదా ప్రస్తావనే తేలేదు.

Importance of NOTA : నోటాకు ఓటేస్తే.. ప్రయోజనం ఏంటి..!?

పోలవరం ప్రాజెక్ట్‌ని మెరుపు వేగంతో పూర్తి చేస్తామని, మద్యపాన నిషేధం చేస్తామని, ఐదేళ్ల పాటు ఏటా వేసే జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తామని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ రెగ్యులర్ చేస్తామని ఇలా ఎన్నో హామీలను గుప్పించాడు జగన్. అయితే వీటిల్లో ఏదీ కూడా కార్యరూపం దాల్చలేదు. మద్యపాన నిషేధం పేరు చెప్పి, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ఏపీలో మద్యంపై జోక్స్ వైరల్ అయ్యేలా చేశాడు.

యుద్ధప్రాతిపదికన జలప్రాజెక్టుల పూర్తి చేస్తామని చెప్పిన జగన్, ఆఖరి ఏడాది హడావుడిగా పనులు చేస్తున్నట్టుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేయడం తప్ప పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు లేవు..

ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం, ‘అమరావతి’ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు ఎన్నో అభివృద్ది పనులు చేసింది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ పనులను పూర్తి చేయకపోగా, మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి, టీడీపీ చేసిన పనులను పూర్తిగా నిలిపివేశాడు. దీని వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం కలగడమే కాకుండా… రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు కూడా ఏపీ రాజధాని ఇది అని చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఈసారి గెలిస్తే వైజాగ్ రాజధాని చేస్తామంటూ ప్రకటించిన జగన్, ముందు నుంచీ ఎందుకు ఆ పని చేయలేకపోయాడు?

Bryan Johnson : రోజుకి 100 మాత్రలు, వయసును తగ్గించుకోవడానికి ఏడాదికి రూ.17 కోట్లు..

అలాగే ‘ముస్లిం రిజర్వేషన్లు రద్దు’ అని బీజేపీ చెప్తుంటే, నన్ను నమ్మండి నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నేను మిమ్మల్ని కాపాడతాను… అని జగన్ ఒక్క మాట కూడా ముస్లింలకి అనుకూలంగా చెప్పలేకపోయాడు. ఇదే సమయంలో టీడీపీ నేత చంద్రబాబు ‘మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది’ అంటూ ప్రకటించాడు. ఇది ఏపీ ఎలక్షన్స్‌పై కచ్ఛితంగా ప్రభావం చూపించనుంది.

 

Related Post