Chiranjeevi Biography : తెలుగులో స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్‌కి తన బయోగ్రఫీ రాసే బాధ్యత అప్పగించాడు మెగాస్టార్ చిరంజీవి. మొగల్తూరులో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్, చిరంజీవిగా మారి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో అయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి వారసులను వెనక్కి నెట్టి.. స్టార్ హీరో అయ్యాడు…
Samantha : అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌తో పాటు ప్రజారాజ్యం పార్టీ పెట్టి మూడేళ్లకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటి విషయాలన్నింటికీ బయోగ్రఫీలో ఆవిష్కరించబోతున్నారు. అయితే చిరంజీవి ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతలు, యండమూరి వీరేంద్రనాథ్‌కి ఇవ్వడమే ఇక్కడ చాలా పెద్ద విశేషం… ఎందుకంటే కొన్నేళ్ల కిందట యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు, మెగా ఫ్యాన్స్‌కి కోపం తెప్పించాయి..
ఓ సభలో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్, ‘నేను ఇందాకా దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు. అదే రామ్ చరణ్ పేరు చెప్పినప్పుడు ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ స్వశక్తితో ఎవ్వరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చాడు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు యండమూరి వీరేంద్ర నాథ్. యండమూరి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉన్నా, రామ్ చరణ్‌ని ట్రోల్ చేయడంతో మెగా ఫ్యాన్స్, ఆయన్ని ట్రోల్ చేస్తూ అప్పట్లో హంగామా చేశారు. ఇప్పుడే అదే యండమూరి వీరేంద్రనాథ్‌కి తన బయోగ్రఫీ రాసే బాధ్యత అప్పగించాడు చిరంజీవి..