Weight Loss Diet : ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు. దీనికి కారణాలు అనేకం పరిష్కారాలే తక్కువ. అయితే బరువు సమస్యతో కడుపు మాడ్చుకోకుండా కడుపునిండా తింటూ బరువు తగ్గడం ఎలా అన్నది తెలుసుకుందాం.. మనం బరువు పెరగడానికి ప్రధాన కారణం పొట్టు తీసేసిన బియ్యంమే!
మినప్పప్పు, పెసరపప్పు, ఇలా పీచు లేని పదార్థాలకు దూరంగా ఉంటూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే జీర్ణశక్తిని పెంచి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే సామలు, ఊదలు, కొర్రలు మొదలైన చిరు ధాన్యాలని మనం మరిచిపోయాం..
Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..
ఒకేసారి సామలు, కొర్రలు తినడం కష్టం కాబట్టి ముందుగా పెరుగన్నంలో తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగన్నం కొర్రల కాంబినేషన్ బావుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తాలింపు వేసుకున్నా ఇంకా రుచిగా ఉంటుంది. కొర్రలు పెరుగన్నం, కొర్రలు, సామల్ని రాత్రి నానబెట్టి వండుకొని తింటే.. బాగా జీర్ణం అవుతాయి. నానబెట్టకుండా వండకూడదు. కనీసం నాలుగు గంటలైనా నానబెట్టాలి. అన్నం వండినట్లే వండుకోవాలి. అలాగే ఇది తిన్న వెంటనే మనకి ఆకలి కూడా వేయదు.
ఇంక ఒకేసారి తెల్లన్నం మానేయలేం కాబట్టి రెండొంతుల తెల్ల బియ్యానికి ఒక వంతు దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్ )కలిపి వండుకుంటే.. తినడానికి బావుండటమే కాకుండా బ్రౌన్ రైస్ లో ఉండే పీచు పదార్థాలు.. బీ విటమిన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు మన శరీరానికి అంది, బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం.
అన్నంతో పాటు ఆకుకూరలు, పప్పు, కూరగాయలని ఎక్కువగా తీసుకోవాలి. అన్నం కూరగాయలు సమానంగా తినడం వల్ల కడుపు నిండటమే కాకుండా జీర్ణ శక్తి పెరుగుతుంది.
పెసరపప్పు, బియ్యం కలిపి చేసే కట్టు పొంగలి.. రకరకాల కూరగాయలతో చేసే సాంబారు ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. లేదా కిచిడీలు ఇలా రోజు ఒకటే కాకుండా రోజుకి ఒకటి చేసుకొని తినొచ్చు అప్పుడు మీకు రోజూ రొటీన్ ఫుడ్ అనే ఫీలింగ్ ఉండదు.
ఇంక టిఫిన్ల విషయానికి వస్తే.. పొద్దున్నే మొలకలు, పండ్లు తిని ఎక్కువ రోజులు ఉండలేం. ప్రత్యామ్నాయంగా పొట్టు తీయని మినుములతో ఇడ్లీ, దోశలు చేసుకోవాలి. పొట్టులో బరువు తగ్గించే పీచుతో పాటు రకరకాల విటమిన్లు ఉండి.. త్వరగా కడుపు నిండుతుంది.
అలాగే తెల్ల ఇడ్లీ రవ్వ కాకుండా జొన్న రవ్వ, రాగి, సజ్జలు, కొర్రలతో కూడా రవ్వ చేసుకుని ఇడ్లీలు చేసుకోవచ్చు. దోశల్లోకి కూడా బియ్యం బదులు చిరుధాన్యాలని నానబెట్టి రుబ్బి పిండిలో కలిపి వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటాయి.
పెసలు కూడా త్వరగా బరువు తగ్గిస్తాయి. పొట్టు తీయని పెసరపప్పు మాత్రమే వాడాలి. పచ్చి కొబ్బరి, పల్లీలు, బెల్లం కూడా బరువు తగ్గిస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ గా పల్లీలు, బెల్లం కలిపి తీసుకోవచ్చు.
ఉదయాన్నే నానబెట్టి న మొలకలు డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిని ఉండటం కష్టం కాబట్టి నాలుగు ఇడ్లీ తినే దగ్గర రెండు ఇడ్లీలు తిని ఈ మొలకలు, డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకోవడం వల్ల అన్నీ తిన్న ఆనందం లభిస్తుంది.
ఉసిరి, క్యారెట్, బీట్రూట్, కీర, సొరకాయ లాంటి జ్యూస్ లలో ఏదో ఒకటి ఉదయాన్నే తీసుకోవడం ఎంతో మంచిది. ఇలా అన్నీ కడుపు నిండా తింటూనే ఆరోగ్యంగా, ఆనందంగా బరువు తగొచ్చు.