Vishwa Hindu Parishath : కులాలు, మతాలు కేవలం మనుషులకేనా! ఏ జంతువులకు ఉండవా.. ఎందుకు ఉండవు. మనుషుల కంటే పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుని, కుక్కల కోసం కోట్లు ఖర్చు పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారు మనమధ్య. అయితే ఊర కుక్కలకు ఇలాంటి రాజభోగాలు దక్కవు, అక్కడ కూడా ‘జాతి’ ఉండాల్సిందే.. ఇప్పుడు ‘సీత’ పేరున్న ఓ సింహాన్ని, ‘అక్బర్’ పేరున్న మగ సింహాంతో జోడి కట్టించిన కేసు, కోల్‌కత్తా హైకోర్టుకి వెళ్లింది.
Indore Beggar : 40 రోజులు అడుక్కుని రూ.2.5 లక్షల సంపాదన..
త్రిపురలోని జూ పార్క్ నుంచి ఓ సింహాల జంటను పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సఫారీ పార్కుని తీసుకొచ్చారు. అందులో శివంగి పేరు సీత అయితే, మగ సింహం పేరు అక్బర్. సింహాలకు వాటికి పెట్టిన పేర్లలో ఉన్న మత తామరస్యాల గురించి తెలీదు కదా.. హాయిగా కలిసి మెలిసి ఉన్నాయి. సఫారీ పార్కుకి వచ్చిన కొందరు వీటి పేర్లను తెలుసుకుని రగిలిపోయారు. సీతను అక్బర్‌తో ఎలా కలుపుతారంటూ ఏకంగా కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసు ఫిబ్రవరి 16న విచారణకి వచ్చింది. ఫిబ్రవరి 20కు వాయిదా పడింది.
సీత పేరున్న అమ్మాయి అయినా, సింహం అయినా రాముడి పక్కనే ఉండాలని.. అక్బర్, బీర్బల్ పక్కన ఉండకూడదని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు విశ్వహిందూ పరిషత్ నాయకులు. అయితే సీత అనే పేరున్న శివంగా కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోందని, చాలా నెలల తర్వాత అక్బర్ పేరున్న మగ సింహంతో అది జత కట్టిందని ఆ జూ నిర్వాహకులు చెబుతున్నారు.
Bollywood : బాలీవుడ్ పనైపోయిందా..!?