TS to TG : తెలంగాణ రాష్ట్రంలో అధికారికంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, రూ.500లకే గ్యాస్ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలమని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు చేయనుందని సమాచారం.
Mega Family : లక్ష్మీదేవి పుట్టింది, లక్ తీసుకొచ్చింది.. పవన్ ఏపీ సీఎం కావడమే బాకీ..
తెలంగాణ స్టేట్ నెంబర్ ప్లేట్స్‌కి TS నెంబర్ ప్లేట్ కేటాయిస్తున్నారు. అయితే ఇకపై TS నెంబర్ ప్లేట్స్‌కి బదులుగా TG ఇవ్వాలని భావిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన డెవలప్‌మెంట్, నగరవాసుల్లో బలమైన ముద్ర వేసుకుని, నగరంలో క్లీన్ స్వీప్ చేసింది.
గ్రామాల్లోనూ 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలతో రైతులకు చేరువైంది. కాబట్టి జనాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్.. అయితే ఇప్పుడు నెంబర్ ప్లేట్లు మార్చుకోమని చెబితే, జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
Ap Elections : వైసీపీలో పెరుగుతున్న జింపింగ్ రాయుళ్లు! తెలంగాణలో జరిగినట్టే, ఏపీలో జరగనుందా…