Tollywood vs Kollywood : ఇండియాలో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్న సినీ ఇండస్ట్రీలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్. టాలీవుడ్ నుంచి వచ్చిన ‘బాహుబలి’, ‘RRR’, ‘సలార్’ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ 3లో ఉన్నాయి. బాలీవుడ్ నుంచి కూడా ‘పఠాన్’, ‘జవాన్’, ‘యానిమల్’ వంటి చిత్రాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి. కోలీవుడ్ నుంచి ‘రోబో’, ‘లియో’, ‘జైలర్’ వంటి చిత్రాలు రికార్డు లెవెల్ కలెక్షన్లు వసూలు చేశాయి. మలయాళం, కన్నడ, మరాఠీ ఇండస్ట్రీ నుంచి చాలామంచి సినిమాలు వస్తున్నా, బాక్సాఫీస్ వాటి స్టామినా చాలా తక్కువ.
SSMB29 : మహేశ్‌తో సినిమా కోసం టీమ్ రెఢీ చేసిన రాజమౌళి..
ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ రచ్చ నడుస్తోంది. మా సినిమా గొప్పంటే, మా సినిమా గొప్పంటూ అటు తమిళ ఫ్యాన్స్, ఇటు తెలుగు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఏ మార్కెట్‌లో అయినా ఇలాంటి గొడవలు సహజం. అయితే సినిమాలు తీసే దర్శక నిర్మాతలు, లేదా నటులు ఇలా కొట్టుకుంటే ఏమైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొట్టుకుంటోంది మాత్రం డబ్బులు పెట్టి, టికెట్ కొని సినిమా చూసి నష్టపోయే ఫ్యాన్స్ మాత్రమే!
కేవలం కాలక్షేపం కోసం చూసే సినిమాని ఓ ఎమోషన్‌గా మార్చుకోవడమే కాకుండా, హీరోలను దేవుళ్లుగా కొలవడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుందేమో! ప్రపంచంలో ఏ దేశంలోనూ సినిమా నటులకు ఇంతటి గౌరవం దక్కదు. కొన్ని దశాబ్దాలుగా మా హీరో గొప్పంటే, మా హీరో గొప్పని కొట్టుకున్నారు అభిమానులు. ఇప్పుడు కాస్త పరిధి పెరిగి మా ఇండస్ట్రీ తోపంటే మా ఇండస్ట్రీ తోపు అని కొట్టుకుంటున్నారు. అంటే సినిమాలంటే పిచ్చి, వెర్రి ముదిరి, సోషల్ మీడియా కూడా కలవడంతో ఇంకో రేంజ్‌కి వెళ్లింది అభిమానం అంటే వ్యాధి.