Tirumala AnnaPrasadam : ఇకపై అన్న ప్రసాదాల కోసం 48 గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. గతంలో చాలామంది భక్తులు తిరుమలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నామంటూ మీడియాలో వీడియోలో వాపోయిన విషయం అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలు, వృద్ధులతో, షుగర్ పేషంట్స్ క్యూలైన్లో నిల్చుంటే కనీసం మంచినీళ్లు కూడా లేవని ఎన్నోసార్లు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పట్టించుకునే నాథుడే లేకుండా లేకపోయాడు.
గత ప్రభుత్వంలో మునుపటి గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్యామలరావుని నియమించి పాతరోజుల్లో ఇచ్చే అన్నపానియాలు ఇవ్వడం మొదలు పెట్టింది.
మొత్తానికి పునః ప్రారంభం :
తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు, ప్రత్యేకించి పిల్లలు, షుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ. కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు ఇదే మహాప్రసాదం. అలాగే వెంగమాంబ అన్నసత్రంలో భోజనం యొక్క నాణ్యత కూడా చాలా బాగుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Accommodation in Tirumala : తిరుమలలో రూమ్ దొరకడం లేదా! ఇలా చేస్తే నిమిషాల్లో రూమ్ గ్యారంటీ!!
అలానే శ్రీవారి మెట్టు మార్గం గుండా దివ్య దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కూడా మొదలైంది. కాగా శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. కొత్తగా వచ్చిన EO ప్రతీది నిశిత పరీశీలనతో పరీక్షించి మార్పులు చేస్తున్నందుకు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.