Tiragabadara Saami Movie Review : రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో వరుస హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. గత వారం ‘పురుషోత్తముడు’ సినిమా రిలీజ్ చేసిన రాజ్ తరుణ్, వారంలోనే ‘తిరగబడర సామీ’ మూవీ రిలీజ్ చేశాడు. అనేక కారణాల వల్ల రాజ్ తరుణ్ వార్తల్లో నిలవడంతో ఈ సినిమా ట్రెండ్ అయ్యింది..
హీరో చాలా పిరికివాడు. గాంధీ మార్గంలో అహింసే ఆయుధంగా బతకాలని కోరుకునే మనిషి. అలాంటి వ్యక్తి, జీవితంలోకి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్‌కి మొదటి నుంచి ఫైట్స్, యాక్షన్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్ వల్ల హీరోకి వచ్చిన ఇబ్బందులు ఏంటి? వాటిని హీరో ఎలా ఫేస్ చేశాడు? ఇదే సినిమా కథ…
కాస్త ఇంట్రెస్టింగ్‌గా మొదలయ్యే సినిమా, ముందుకు సాగే కొద్దీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. రాజ్ తరుణ్ మరోసారి సినిమాని తన నటనతో లాక్కొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అందంగా ఉండడమే కాకుండా తన నటనతోనూ మెప్పించింది..
డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి రాసుకున్న కథ పాతదే, స్క్రీన్ ప్లే పాతదే. ఆఖరికి తీసిన విధానమూ పాతదే. మ్యూజిక్ డైరెక్టర్ జేబీ కూడా సినిమాకి ఏ మాత్రం హెల్ప్ కాలేకపోయాడు. మొత్తానికి ‘తిరగబడర సామి’ సినిమాకి వెళ్తే ఎందుకొచ్చామురా సామీ అని అనిపించక మానదు..