ఆగని రీ-రిలీజ్‌ల గోల… థియేటర్ల కోసం ఫైట్ నడుస్తుంటే మరో రెండు పాత సినిమాలను

2023 ఏడాదిలో చాలా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలకు చాలా రోజుల తర్వాత ఈ ఏడాదిలోనే సక్సెస్ అందింది. అలాగే బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పడింది. షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంటే, ‘గదర్ 2’ రికార్డులు కొల్లగొట్టింది. ‘యానిమల్’ అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

అల్లు అరవింద్ లేకపోతే, చిరంజీవికి నా పరిస్థితే వచ్చేది! చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్..

ఈ ఏడాది రీ-రిలీజ్‌ల ట్రెండ్ కూడా బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ నటించిన పాత చిత్రాలతో పాటు ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలు 4K వర్షన్‌లో తిరిగి థియేటర్లలోకి వచ్చాయి. ‘సింహాద్రి’, ‘గబ్బర్ సింగ్’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి సినిమాలు మినహాయిస్తే మిగిలిన రీ-రిలీజ్‌లకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ‘అదుర్స్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలకు అస్సలు రెస్పాన్స్ రాలేదు.

అయినా కూడా రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రవితేజ-శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన ‘వెంకీ’ మూవీని డిసెంబర్ 30, రజినీకాంత్-శంకర్ కాంబోలో వచ్చిన ‘శివాజీ’ మూవీని డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేయబోతున్నారు. అసలే థియేటర్ల కోసం కొత్త సినిమాల మధ్య గొడవ జరుగుతుంటే… ఈ సమయంలో రీ-రిలీజ్‌లను థియేటర్లలోకి తేవడం కరెక్ట్ కాదంటున్నారు ట్రేడ్ పండితులు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post