TFI Fans Cricket : తెరపైన కనిపించే హీరోలకు అభిమానులు ఉండేవాళ్లు. తొలి తరంలో ఎన్టీఆర్- ఏఎన్నాఆర్ మధ్య పోటీ ఉన్నా, అభిమానులు కొట్టుకున్న సందర్భాలు లేవు. అయితే కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఎంట్రీతో ఫ్యాన్స్ కోసం సంఘాలు పుట్టుకొచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున తరం వచ్చేసరికి ఫ్యాన్స్ ఫీల్ అవుతారని, వాళ్లకు నచ్చేలా సినిమాలు ఎంచుకోవడం మొదలైంది. హీరో మీద చెయ్యి పడితే, అభిమానులు థియేటర్లను ధ్వంసం చేయడం, మల్టీస్టారర్ చేస్తే మా హీరోకు ప్రాధాన్యం తక్కువ ఉందని రీల్స్‌ని తగలబెట్టడం వంటివి జరిగాయి..
సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..
మహేష్, ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ తరం వచ్చేసరికి సోషల్ మీడియా యుగం మొదలై, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో యుద్ధాలే మొదలయ్యాయి. తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ పేరుతో హీరోల ఫ్యాన్స్ టీమ్ మధ్య క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఆలోచన బాగున్నా, మ్యాచుల నిర్వహణ సక్రమంగానే జరుగుతున్నా… లీగ్ పూర్తయ్యేసరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోననే భయం.. మ్యూచువల్ ఫ్యాన్స్‌లో కలుగుతోంది…
కేవలం పోస్టర్ల కోసం, ఓ చిన్న సోషల్ మీడియా పోస్ట్ కోసం కొట్టుకునే ఫ్యాన్స్… టీఎఫ్‌ఐ క్రికెట్ లీగ్ టోర్నీ కోసం ఎక్కడిదాకా వెళ్తారో, ఏం చేస్తారోననే భయం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఈ టోర్నీ ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అందరు ఫ్యాన్స్ సాదరంగా స్వాగతిస్తే… టాలీవుడ్ నిజంగానే బాగుంటుంది!