T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఇదే! ఈసారైనా..

T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). మంగళవారం, బీసీసీఐ సెక్రటరీ జై షాతో సమావేశమైన సెలక్టర్లు, మీటింగ్ తర్వాత టీమ్‌ని ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడుతుంది భారత జట్టు. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.

MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..

రోహిత్ శర్మ, కుర్ర బ్యాటర్ యశస్వి జైస్వాల్ కలిసి ఓపెనింగ్ చేయబోతున్నారు. సీనియర్ వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లేదా రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో వరల్డ్ కప్ కోసం ఏకంగా యజ్వేంద్ర చాహాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో నలుగురు స్పిన్నర్లను ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు సెలక్టర్లు..

గుజరాత్ టీమ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, కలకత్తా టీమ్ ఫినిషర్ రింకూ సింగ్, ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ బౌలర్ ఆవేశ్ ఖాన్.. రిజర్వు ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లబోతున్నారు.

Indian Squad for T20World cup 2024: Rohit Sharma (c), Yashasvi Jaiswal, Virat Kohli, SuryaKumar Yadav, Sanju samson (WK), Rishabh Pant (WK), Shivam Dube, Ravindra Jadeja, Hardik Pandya (VC), Yuzi chahal, ravi Jadeja, Axar Patel, Kuldeep Yaav, Jasprit Bumrah, Arshdeep Singh, Mohammed Siraj.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post