T20 World Cup2024 : 17 ఏళ్ల తర్వాత భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 47 పరుగులు చేయగా శివమ్ దూబే 27 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు.
ఈ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లు ఆడి 169 పరుగులే చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసిన్ 27 బాల్స్ ఆడి 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. క్లాసిన్ ఉన్నంతవరకూ సౌతాఫ్రికా మ్యాచ్ గెలిచేలా అనిపించింది. అయితే హర్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లాసిన్ అవుట్ కావడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచింది..
Afghanistan vs Bangladesh : టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. తొలిసారి సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్..
ఇంతకుముందు కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 వన్డే వరల్డ్ కప్, ధోని కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ 2011 టైటిల్స్ గెలిచిన భారత జట్టుకి రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్ కప్ అందించాడు.