Swathi reddy month of Madhu review detailed analysis : బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లిన కలర్స్ స్వాతి, స్టార్ హీరోయిన్ కాలేకపోయినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రీఎంట్రీలో ఆమె చేసిన మూవీ ‘మంత్ ఆఫ్ మధు’. ఓ తాగుబోతు భర్త, అతని మార్చుకోలేనని తెలిసి విడాకులు తీసుకోవాలని ప్రయత్నించే భార్య, విదేశాల్లో పెరిగి, ఇండియాలో ఆచార వ్యవహరాల గురించి తెలియని ఓ ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి.. సింపుల్‌గా ఈ ముగ్గురి కథే ‘మంత్ ఆఫ్ మధు’.
నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ షాకింగ్ కామెంట్స్..
లేఖ, మధు (మధుసూదన్ రావు)ని ఎంతో ప్రేమిస్తుంది. అతని కోసం తప్పని తెలిసినా, పెళ్లికి ముందు చేయకూడనివన్నీ చేస్తుంది. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటుంది. మధు వ్యక్తిత్వం, మనలో చాలామందిలో కనిపిస్తుంది. మనకి లేనప్పుడు, మనది కానప్పుడు ‘ఎవడికి గొప్ప? మనం చేయలేకా?’ అనుకోవడం… చేతకానితనాన్ని ఒప్పుకోలేకపోవడం… తనని తాను అందరికంటే గొప్పోడు, సమర్థుడిగా ఊహించుకోవడం.. ఇదే మధు క్యారెక్టర్.
లేఖ చాలా సింపుల్. మధుని అమితంగా ప్రేమిస్తుంది. కానీ ప్రేమకి కూడా ఓపిక నశిస్తుందని తెలుసుకుంటుంది. మధు మొదట ఎలా ఉన్నాడో ఆఖరి దాకా అలాగే ఉంటాడు. అతన్ని మార్చుకోగలను అనుకున్న లేఖ మాత్రం మారిపోతుంది.
‘ప్రేమ ఉంటే చెప్పాలి’ అంటుంది లేఖ. ‘ప్రేమ ఉంటే చెప్పాలా? చెప్పకుండానే అర్థం అవుతుంది కదా’ అంటాడు మధు. కానీ ఈ ముక్క కూడా లేఖతో చెప్పడు. ఎందుకంటే భార్యతో మనసు విప్పి మాట్లాడడం కూడా చిన్నతనంగా భావించే పురుషాధిక్య ప్రపంచంలో పెరిగిన పొగరు తనది.
లంగా ఓణీలలో మెరుస్తున్న సినీ పూబోణి..
అదే పొగరు, పరాయి ఆడదాని పక్కలో పడుకోవడానికి వెళ్లినప్పుడు ఉండదు. తన భార్యపై ప్రేమను మొత్తం ఆమె ముందు విప్పుతాడు. ‘మా నాన్న ఇలాగే చూపించాడు. నేను ఇలాగే చూపించా. నాకు తెలిసింది ఇదే’ అంటాడు. చదువురాని, వంటింట్లో సర్దుకుని బతికిన తన తల్లి, చదువుకుని, ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించే లేఖ ఇద్దరూ ఒకే కోవలోకి వేస్తాడు…
ఒకడు బాగుపడడానికి, చెడిపోవడానికి రెండింటికీ ఓ స్నేహితుడే కారణం. వాడి చెప్పుడు మాటలు వింటూ బతకడం వల్లే మధు, జీవితంలో ఎన్నో కోల్పోతాడు. చివరికి కోల్పోవడానికి ఏమీ లేని పొజిషన్‌కి చేరుకుంటాడు. ఇక్కడ స్నేహితుడిది కూడా తప్పు కాదు. ఎందుకంటే చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు, కానీ ఏది వినాలి? ఏది పాటించాలనే జ్ఞానం మనకే ఉండాలి. అందుకే మధుతో ఎప్పుడూ ‘ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు’ డైలాగ్ చెప్పించి, అతను దేన్నీ తెలుసుకోలేని అమాయకుడిగా తేల్చేశాడు శ్రీకాంత్ నాగోతి.
లేఖపైన మధుకి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు మధు అనే అమ్మాయి పాత్ర. ఆ పాత్రకి మొదట్లో ఉన్న కంఫ్యూజన్‌ని, చివరికి తుడిచేసినా.. ఆ నెలరోజుల్లో మధు ఏం నేర్చుకుంది? ఏం తెలుసుకుంది? కేవలం తల్లికి తన మీదున్న ప్రేమేనా? ఆమెని ప్రేమించిన కుర్రాడి పరిస్థితి ఏంటి? ఇలాంటి చిన్న చిన్న విషయాలను మరికాసేపు చూపించి ఉంటే, ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ మరింత బాగుండేది.
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..
‘మంత్ ఆఫ్ మధు’ ఓ ప్రేమకథ. అయితే రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఓ సైకాలజికల్ ప్రేమ కథ. దీన్ని పూర్తిగా చూడాలన్నా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే కూడా కాస్త ఓపిక కావాలి.