SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..

SSMB 29 : రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే. ‘బాహబలి’ సినిమాల కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు అంకితమిచ్చేశాడు. ‘బాహుబలి’ సినిమాకి ముందు ప్రభాస్‌కి పెళ్లి చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ సినిమా ఒక్కటీ చేసి పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పడంతో పెద్దనాన్న కృష్ణం రాజు ఒకే అన్నారు. ఆ సినిమా రెండు పార్టులుగా మారి, రిలీజ్ అవ్వడానికి ఐదేళ్లు పట్టడంలో ప్రభాస్ పెళ్లి వాయిదా పడుతూ వెళ్లింది.

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

ప్రభాస్ విషయం పక్కనబెడితే, RRR సినిమా కోసం ఎన్టీఆర్ కూడా నాలుగేళ్లు వేరే ఏ సినిమాలు చేయలేదు. అప్పుడెప్పుడో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత’ తీసిన ఎన్టీఆర్, గత ఆరేళ్లలో విడుదల చేసింది రెండే సినిమాలు..

మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయడానికి అంగీకరించాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. అయితే ఈ సినిమాలో మహేష్‌ని పూర్తిగా కొత్త లుక్‌లో చూపించాలని అనుకుంటున్నాడు రాజమౌళి. సినిమా సెట్స్ మీదకి వెళ్లి, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే వరకూ బయట కనిపించకూడదని, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని రాజమౌళి, మహేష్‌కి కండీషన్ పెట్టాడట..

మహేష్‌ బాబు – సౌందర్య కాంబోలో మూవీ.. మధ్యలో కథ అడ్డం తిరిగి..

అయితే మహేష్ మాత్రం రోజుకో ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకుముందు కూడా మహేష్ ఇలా సోషల్ మీడియాలో రోజుకో ఫోటో షేర్ చేసింది లేదు. చూస్తుంటే మహేష్- రాజమౌళి సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయిందా? ఏంటి అని అనుమానపడుతున్నారు కొందరు అభిమానులు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post