Srimanthudu Controversy : మాటల రచయితగా కెరీర్ మొదలెట్టి, దర్శకుడిగా మారాడు కొరటాల శివ. ప్రభాస్‌తో ‘మిర్చి’ తీసి, మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ తీసి తెలుగు ఆడియెన్స్‌కి ఫేవరెట్‌గా మారిపోయాడు. మారుమూల గ్రామాలను దత్తత తీసుకుని, బాగుచేయడం అని ‘శ్రీమంతుడు’ సినిమాలో కొరటాల శివ చెప్పిన ఫార్ములా చాలామందికి నచ్చింది. మహేష్ కూడా ఈ ఫార్ములాని పాటించి, కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాడు.
చిరుతలా పెరుగెడుతున్న యంగ్ టైగర్..
అయితే ఈ కథను, స్వాతి వార పత్రికలో తాను రాసిన కథను కాపీ చేశాడని రచయిత శరత్ చంద్ర కేసు పెట్టాడు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు, శరత్ చంద్ర చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? లేదా? తేల్చేందుకు కొందరు రచయితలతో సంఘం ఏర్పాటు చేసింది. శరత్ చంద్ర రాసిన ‘చచ్చేంత ప్రేమ’ కథను, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ రచయితల సంఘం.. కాపీ జరిగినట్టు తేల్చారు. చచ్చేంత ప్రేమలో ఉన్న పాత్రల పేర్లు మార్చి, సంఘటనలను కూడా యథావిథిగా వాడేశాడని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో కొరటాల శివపై కాపీ రైట్స్ చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది నాంపల్లి కోర్టు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టుకి వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో సుప్రీంని ఆశ్రయించాడు కొరటాల శివ. అయితే రచయితల సంఘం అంత క్లియర్‌గా కాపీ అని నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ మా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టంది. దీంతో కొరటాల శివ, ‘శ్రీమంతుడు’ ద్వారా సంపాదించిన రూ.10 కోట్లు, రచయిత శరత్ చంద్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..