Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

Sr NTR Bhanumathi : తొలితరం నటుల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్ అయితే, హీరోయిన్లలో మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్ ఇమేజ్ భానుమతి గారికే సొంతం. 100కి పైగా సినిమాల్లో నటించిన భానుమతి రామకృష్ణ… నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, నవలా రచయితగా కూడా నిరూపించుకుంది.

మరోసారి షాకింగ్ కామెంట్స్‌ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..

తెలుగు సినీ చరిత్రలో మహిళల ఆత్మగౌరవం ప్రస్తావన వస్తే భానుమతి గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆమె జీవితం ఎవరి దయాదాక్షిణ్యాల మీద నిర్మించింది కాదు. తనను తానుగా అన్నీ తానై తన జీవితాన్ని చెక్కుకున్న శిల్పి భానుమతి.

ఆమె తన తెలివితో, సమయస్ఫూర్తితో సీనియర్ ఎన్టీఆర్‌నే బిత్తరపోయేలా చేసిన సంఘటన ఇది. ఎన్టీఆర్ దర్శకత్వంలో తన కొడుకు నందమూరి బాలకృష్ణను పరిచయం చేస్తూ, నిర్మించిన సినిమా ‘తాతమ్మ కల’ (1974). ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌కి జోడిగా రవమ్మ పాత్రలో నటించింది భానుమతి..

Sr NTR Bhanumathi

భానుమతి రెమ్యూనరేషన్ గురించి చర్చ జరిగినప్పుడు, ‘హీరోకి ఎంత ఇస్తున్నారో, దానికి 5 వేలు తక్కువగా నాకు ఇవ్వమని’ కోరిందట భానుమతి. అప్పటికి సీనియర్ ఎన్టీఆర్, వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ హీరోగా ఉన్నాడు.

దేవరలో ఇదీ జరుగుతుంది..

సినిమాకి రూ.4 లక్షల దాకా తీసుకునేవాడు ఎన్టీఆర్. అయితే తాను రూ.4 లక్షలు తీసుకుంటే, భానుమతికి రూ.3 లక్షల 95 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తాను రూ.2 లక్షలే తీసుకుంటున్నట్టు చెప్పిన సీనియర్ ఎన్టీఆర్, భానుమతికి పారితోషికం కింద రూ.1 లక్షా 95 వేలు ముట్టచెప్పాడు..

అయితే సీనియర్ ఎన్టీఆర్ అప్పటికి సినిమాకి రూ.4 లక్షలు తీసుకుంటున్న విషయం భానుమతికి తెలుసు. దీంతో తనకిచ్చిన రూ.1 లక్షా 95 వేలకు మరో 5 వేలు జోడించి, రామారావుకి రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి, తన తర్వాతి సినిమాకి అగ్రిమెంట్ చేయించుకుంది భానుమతి..

పవన్ కళ్యాణ్, నాని, కార్తీ.. ఆ హీరోలకి కలిసి రాని 25వ చిత్రాలు..

తాను రూ.2 లక్షలే తీసుకుంటున్నానని చెప్పిన సీనియర్ ఎన్టీఆర్, సినిమాకి రూ.4 లక్షలు తీసుకుంటున్నానని చెబితే.. మరో రూ.2 లక్షలు భానుమతికి పారితోషికంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చూసినా, ఇలా చూసినా రూ.2 లక్షలు నష్టపోవాల్సి ఉంటుంది. ఇక చేసేదేమీ లేక రూ.2 లక్షలకే భానుమతి సినిమాలో నటించడానికి అంగీకరించాడు సీనియర్ ఎన్టీఆర్..

అలా భానుమతి దర్శకత్వం వహించిన ‘అమ్మాయి పెళ్లి’ సినిమాలో నటించాడు ఎన్టీఆర్.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post