Special Story about Smoking Culture : థియేటర్‌కి వెళితే, ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని కచ్ఛితంగా కనిపిస్తుంది. అయితే సినిమాలో హీరో స్టైల్‌గా స్మోక్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు. స్టైల్ చూపించడానికి స్మోకింగ్ అలవాటుని వాడుతూ, తాగకూడదంటే ఎవడు వింటాడు. అందుకే భారత్‌లో పొగతాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతుందట..
లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే, ‘వీరభోగ వసంతరాయలు’ పుడతాడని ఎన్టీఆర్‌కి చెప్పిన జ్యోతిష్యుడు..
తాజా అధ్యయనం ప్రకారం ఇండియా లో ప్రతి 100 మందిలో దాదాపు 45% మంది స్మోక్ చేస్తున్నారు. ఒకప్పుడు స్మోకింగ్ చేయాలంటే చాలా భయపడి, అవకాశం దొరికినప్పుడే చేసేవాళ్లు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సిగరెట్ కాల్చడం అనేది ఇప్పుడు ఓ ఆర్ట్. బహిరంగంగా స్మోకింగ్ నిషేధం అనే నిబంధనలు తీసుకొచ్చినా, కార్పొరేట్ ఆఫీసుల్లో స్మోకింగ్ కోసం సెపరేట్‌గా ప్లేస్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చేసింది.
కార్పొరేట్ వర్క్ కల్చర్ కారణంగా టెన్షన్ తట్టుకోలేక, ఆడాళ్లు కూడా స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు. మందు, సిగరెట్, ప్రేమ.. ఒక్కసారి అంటుకుంటే అంత త్వరగా వదలవు. అందుకే చాలా మంది ఈ వ్యసనాలకు బానిసలైపోయి, ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ ఇబ్బంది పడుతున్నారు.
సిక్కులను కించపరిచారు! ‘యానిమల్’ని బ్యాన్ చేయాలి.. రాజ్యసభలో రచ్చ..
ఒక తాగుబోతు తాగితే తాను, తన కుటుంబం మాత్రం బలి అవుతుంది… అయితే ఈ స్మోకింగ్ అలవాటు వల్ల తాగే వారికి మాత్రమే కాదు, అతని చుట్టు ఉన్న వాళ్లకి, పర్యావరణానికి కూడా చేటు జరుగుతోంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఈ స్మోకింగ్ చాలా ప్రభావం చూపిస్తోంది. చిన్న వయసులోనే హృదోగ్రులకు గురయ్యే పిల్లల సంఖ్య పెరగడానికి పెద్దల్లో ఉండే ఈ పొగ తాగే అలవాటే కారణం…
సిగరెట్ల ధరలు పెంచితే, తాగే వారి సంఖ్య తగ్గుతారు! లేదంటే సిగరెట్ల మీద భయపెట్టే బొమ్మలు వేస్తే తాగేవారి సంఖ్య తగ్గుతారేమోనని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. అయితే వాటి వల్ల ఎలాంటి లాభం ఉండదని ప్రభుత్వాలకు తెలుసు.
స్కూల్స్ బంద్.. బండ్లు రోడ్లు ఎక్కాలంటే రూల్.. ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి..
అయితే ప్రభుత్వం నడవడానికి కావాల్సిన ట్యాక్సుల్లో ఎక్కువ మొత్తం ఈ టొబాకో, అల్కహాల్ అమ్మకాల వల్లే వస్తోంది. అందుకే ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది కాదని తెలిసినా.. వాటిపై నిషేధం ఉండదు. అలా నియంత్రించే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాతి ఎన్నికల్లో ఆ ప్రభుత్వమే ఉండదు. అది సిగరెట్‌కి, మందు సీసాకి ఉన్న పవర్..