Animal controversy reaches Parliament: ‘యానిమల్’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీపై వివాదాలు కూడా రేగుతూనే ఉన్నాయి. తాజాగా రాజ్యసభలో ‘యానిమల్’ మూవీ గురించి చర్చ జరిగింది. ‘నా కూతురు, తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో కలిసి యానిమల్ మూవీ చూసేందుకు వెళ్లింది. ఏడుస్తూ మూవీ మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. అర్జన్‌వెయల్లీ పాటను ఓ ఫైట్ కోసం వాడి, మూవీ మేకర్స్ సిక్సుల మనోభావాలను కించపరిచారు. వెంటనే దాన్ని తొలగించాలి. లేదంటూ ఆ చిత్రాన్ని బ్యాన్ చేయాలి..’ అంటూ వ్యాఖ్యానించాడు రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్..
ఇలాంటి చెత్త సినిమాలు చేయకు.. బాబీ డియోల్‌ని తిట్టిన తల్లి..
‘యానిమల్, పుష్ప వంటి సినిమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు యూత్‌కి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు. సినిమా వాళ్లకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. స్మగ్లర్లను, మాఫియా డాన్స్‌ని హీరోలుగా చూపిస్తే, భవిష్యత్ తరాలు ఏం నేర్చుకుంటారు..’ అంటూ కామెంట్లు చేసింది రంజిత్ రంజన్..
మహువా మోయిత్రాపై బహిష్కరణ వేటు.. లోక్‌సభ సభ్యత్వం రద్దు..
ఇప్పటికే రూ.500 కోట్ల కలెక్షన్ల మార్కు దాటేసిన ‘యానిమల్’, రెండో వారంలోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘యానిమల్’, అన్ని చోట్ల భారీ లాభాలను తెచ్చి పెట్టింది.