Shaolin Soccer : బెస్ట్ హాంకాంగ్ మూవీ షావోలిన్ సాకర్..

Shaolin Soccer :

Cast : స్టీఫెన్ చౌ (Stephen Chow), Ng Man-tat, Zhao Wei, Kai-Man Tin
Director : స్టీఫెన్ చౌ (Stephen Chow)
Producer : క్వాక్-ఫై యెంగ్ (Kwok-Fai Yeung)
Languages: Chinese, Cantonese, Mandarin
Release Date : July 12, 2001
OTT Platform : Amazon Prime

హాంకాంగ్ నగరం.. చైనా పరిధిలోని భూభాగమే అయినప్పటికీ దీనికి ప్రత్యేక పరిపాలనాధికారాలు ఉన్నాయి. దాదాపు 150 ఏళ్లు హాంకాంగ్ బ్రిటీష్ పాలనలోనే కొనసాగింది. 1997 నుంచి హాంకాంగ్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన టెరిటరీ ప్రాంతంగా అవతరించింది.

అప్పట్నించీ అక్కడి ప్రజలు తాము చైనీయులుగా కాకుండా హాంకాంగ్ వారిగా గుర్తింపబడేందుకు ఇష్టపడ్డారు. క్రమేణా హాంకాంగ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి.. వ్యాపారానికి కేంద్రబిందువుగా మారింది.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ నిలిస్తే.. ఆ తర్వాతి స్థానంలో హాంకాంగ్ ఉంది. దీంతోపాటు మార్షల్ ఆర్ట్స్ కి పెట్టింది పేరు చైనా మరియు హాంకాంగ్. మార్షల్ ఆర్ట్స్ ఇతివృత్తంతో ఎన్నో సినిమాలు రాగా.. టాప్ 10 మూవీస్ లో ఒకటి షావోలిన్ సాకర్.

Shaolin Soccer

స్టీఫెన్ చౌ ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ తో పాటు హీరో కూడా..! స్పోర్ట్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. కుంగ్ ఫూ ని మిక్స్ చేసి సాకర్ (Football) ఆడితే ఎలా ఉంటుంది అనేది సింగల్ లైన్ స్టోరీ. ఈ క్రమంలో ఓ బలహీనమైన సాకర్ జట్టు భయంకరమైన మరో జట్టును ఎదుర్కొని ఎలా గెలుస్తుందనేదే సినిమా.

బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..

చాలా సినిమాల్లో ఒక్కో కళను ఒక్కోలా చూపిస్తారు కానీ ఇందులో కళే సినిమా.. సినిమానే కళ. ఈ సినిమాలో ప్రతి సీన్ కథకు ఎంతో బలం చేకూర్చేలా ఉంటుంది. ఇందులో కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగుంటాయి.

ఈ సినిమా ద్వారా మనకున్న ఒక కళ జీవితంలో ఎలా భాగం అవుతుందో, అది మనం చేసే ప్రతి పనిలో ఎలా పతిబింబిస్తుందో తెలుస్తుంది.

ఇందులోని ప్రేమ మనకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు బయట చూపించే చచ్చుపుచ్చు ఆకర్షణ, అందం ఇందులో ఉండవు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. ఒకరినొకరు గౌరవించుకోవడమే ఇందులోని ప్రేమ ప్రత్యేకత.

ఈ సినిమాను అర్థం చేసుకోవడానికి భాష మనకు అడ్డు కాలేదు. సినిమాను సినిమానే ముందుకు నడిపిస్తుంది. ఈ సినిమా చూడడం ద్వారా మనం ఏదైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవలన్న కోరిక కలగక మానదు.

‘బేబీ’ని నిజంగా Cult Classic అనొచ్చా..!?

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post