ఆ మేనేజర్ మతిమరుపు, సావిత్రి కెరీర్‌నే మార్చేసింది! భానుమతి ప్లేస్‌లో ‘మహానటి’..

Savitri – Bhanumathi : రాసి పెట్టి ఉంటే, యముడే దిగివచ్చినా చావు దరిచేరదని అంటారు. కొన్ని సంఘటనలు బయటికి వచ్చినప్పుడు ఈ విషయం నిజమేనని అనిపిస్తూ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 15 ఏళ్లు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది సావిత్రి. కెరీర్ ఆరంభంలో అవకాశాలు దక్కించుకోవడానికి బాగా కష్టపడిన సావిత్రి కెరీర్‌ని ‘మిస్సమ్మ’ మూవీ మార్చేసింది.

ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘మిస్సమ్మ’ మూవీని ఎల్‌.వీ. ప్రసాద్ తెరకెక్కిస్తే, నాగి రెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు. నిజానికి ఈ మూవీలో తొలుత హీరోయిన్‌గా భానుమతిని అనుకున్నారు. భానుమతితో సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

Savitri - Bhanumathi
భానుమతి

భానుమతి గారికి దేవుడంటే విపరీతమైన భక్తి. ‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు వరలక్ష్మీ వ్రత పూజ ఉండడంతో భానుమతి, షూటింగ్‌కి ఆలస్యంగా వస్తానని మేనేజర్‌కి చెప్పి, చిత్ర యూనిట్‌కి తెలియచేయాల్సిందిగా పంపించింది. అయితే ఆ మేనేజర్‌ ఆ విషయాన్ని మరిచిపోయాడు.

Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

భానుమతి ఎంతకీ రాకపోవడంతో నిర్మాతల్లో ఒక్కడైన చక్రపాణికి బాగా కోపం వచ్చి, అప్పటికప్పుడు సావిత్రిని హీరోయిన్‌గా పెట్టి, షూటింగ్ మొదలెట్టారు. భానుమతి నటించిన నాలుగు రీళ్లను అప్పటికప్పుడు తగలబెట్టేశారు. ఆ రోజు భానుమతి క్షమాపణలు చెప్పి ఉంటే, ఆమెను హీరోయిన్‌గా కొనసాగించాలని కూడా చక్రపాణి అనుకున్నారట. అయితే ఆత్మాభిమానం ఉన్న భానుమతి, సారీ చెప్పేందుకు ఒప్పుకోలేదు.

తొలుత సావిత్రిని జమున పాత్ర కోసం అనుకున్నారు. ఆ రోజు ఆలస్యంగా షూటింగ్‌కి వచ్చిన భానుమతిని, ‘నువ్వు వెళ్లి పూజలు చేసుకోమ్మా’ అని తిట్టి పంపించాడు చక్రపాణి.

తర్వాత మేనేజర్, చక్రపాణిని కలిసి జరిగినదంతా వివరించారు. అయితే అప్పటికే సావిత్రి నటనకు ఎల్.వీ. ప్రసాద్ ఇంప్రెస్ కావడంతో ఆ పాత్రకి ఆమే కరెక్ట్ అని షూటింగ్‌ని పూర్తి చేయించారు. అలాగే తెలుగుతో పాటు తమిళ్‌లో ఒకేసారి విడుదలైన ‘మిస్సమ్మ’ అతి పెద్ద విజయం అందుకుంది. సావిత్రిని తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. అలా ఓ మేనేజర్ మతిమరుపు, సావిత్రిని స్టార్‌గా మార్చింది.

ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post