Sarfira Movie Review : సౌత్‌లో హిట్టైన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్టు కొట్టడం అక్షయ్ కుమార్‌కి అలవాటు. ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వరుసగా సూపర్ హిట్స్ కొట్టాడు అక్షయ్ కుమార్. అయితే ఈ మధ్య అక్షయ్ కుమార్ టైమ్ అస్సలు బాలేదు. అక్షయ్ కుమార్ నటించిన ‘చోటే మియాన్ బడే మియాన్’ సినిమా నిర్మాతకు రూ.250 కోట్ల నష్టాలు తెచ్చింది. తాజాగా ‘సూరరై పోట్రు’ రీమేక్ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) మూవీ ‘సర్ఫీరా’ జూలై 12న విడుదలైంది..
Indian 2 Ticket Rates : డబ్బింగ్ సినిమాకి కూడా ఇంత రేటంటే ఎవడు చూస్తాడు!
2000 దశాబ్దంలో పేదవాడికి అందుబాటులోకి విమాన ప్రయాణాన్ని తీసుకురావాలని కలలు కన్న ఎయిర్ డెక్కన్ సంస్థల అధినేన జీఆర్ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కోలీవుడ్‌లో ఈ సినిమాని తీసిన సుధా కొంగర, బాలీవుడ్‌లోనూ తెరకెక్కించింది. కథ, కథనం అన్నీ సేమ్ టు సేమ్. బాలీవుడ్‌లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జత చేసే ప్రయత్నం చేయడంతో ఒరిజినల్‌లో ఉన్న ఫీల్ పోయింది..
అక్షయ్ కుమార్ మంచి నటుడు. అయితే సూర్య యాక్టింగ్ చూసిన తర్వాత అక్షయ్ కుమార్ అదే పాత్రలో, అదే సీన్స్‌లో చూస్తుంటే ఇమిటేట్ చేస్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ రాధాక మదన్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. తన క్యారెక్టర్‌లో రాధిక చాలా బాగా మెప్పించింది. అయితే ‘సూరరై పోట్రు’ సినిమాని బాలీవుడ్‌లోకి డబ్ చేసి, అమెజాన్ ప్రైమ్‌లో ‘ఉడాయి’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా చాలా మంది చూసేశారు కూడా..
Kalki 2898AD Collections : ఆంధ్రా మార్కెట్‌కి ఏమైంది! రేట్లు పెంచినా, ఇంకా నష్టాల్లోనే..
చూసిన కథ, తెలిసిన కథనం, కొత్త నటీనటులతో తీస్తే ఎవరు చూస్తారనే ఆలోచన లేకుండా తెరకెక్కిన ‘సర్పీరా’ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఒరిజినల్‌లో నటించిన సూర్య, సినిమా క్లైమాక్స్‌లో అలా మెరుస్తాడు… సేమ్ స్టోరీ, సేమ్ డైరెక్టర్, సేమ్.. అన్నీ సేమ్ అయినప్పుడు ఇప్పుడు ఈ బాలీవుడ్ రీమేక్ చూడడానికి ఏం ఉంటుంది.