Filmfare Awards South 2023 : రాజమౌళి తీసిన RRR మూవీ, బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు అయితే రాబట్టింది కానీ, ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయింది. ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేశారని, రామ్ చరణ్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే కొమరం భీమ్‌గా నటించిన ఎన్టీఆర్, RRR మూవీ కారణంగా ఆస్కార్ అవార్డు రేసులో నిలిచాడు. అవార్డు రాకపోయినా ఆస్కార్ యాక్టర్స్ డివిజన్లో చోటు దక్కింది. షారుక్ తర్వాత ది అకాడమీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న భారత మేల్ యాక్టర్ ఎన్టీఆరే..
రామ్ చరణ్ పాత్రకు కాస్త ప్రాధాన్యం ఎక్కువ ఉందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు కూడా అప్పట్లో దుమారం రేపాయి. అయితే ఈ గొడవలో వేలు పెట్టడం ఇష్టం లేక తెలివిగా ఆలోచించింది ఫిల్మ్ ఫేర్. ఉత్తమ నటుడి అవార్డును ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ కలిపి ఇచ్చేశారు. బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి, బెస్ట్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (సీతారామం), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ విలన్‌గా రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్), బెస్ట్ సపోర్టింగ్ నటిగా నందితా దాస్ (విరాట పర్వం) అవార్డులు గెలుచుకున్నారు..
Rajamouli : ఆ ఇద్దరితో ప్రేమదేశం తీయాలనుకున్నాడట..
క్రిటిక్స్ బెస్ట్ హీరోగా దుల్కర్ సల్మాన్ (సీతారామం), బెస్ట్ హీరోయిన్గా సాయి పల్లవి (విరాటపర్వం) విమర్శకుల ఖాతాలో ఫిల్మ్ ఫేర్ గెలిచారు. మొత్తంగా 2023 ఏడాదికి ప్రకటించి ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ 7 అవార్డులు దక్కించుకోగా సీతారామం సినిమాకి 5 అవార్డులు దక్కాయి.