Rohit Sharma : ఐదుసార్లు ఐపిఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్, కరోనా లాక్డౌన్ తర్వాత చాలా కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. గత మూడు సీజన్లలో ఫైనల్ కూడా చేరలేకపోయిన ముంబై ఇండియన్స్, ఈసారి కెప్టెన్‌ని మార్చింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ని ఫైనల్‌కి తీసుకెళ్లాడు కదా అని.. ముంబై మాజీ ప్లేయర్ హార్ధిక్ పాండ్యాని తీసుకొచ్చి కెప్టెన్సీ అప్పగించింది. అయితే ఇదే.. ఈ నిర్ణయమే ముంబై ఇండియన్స్ టీమ్‌ని సర్వనాశనం చేసేసింది.
ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో కొందరు ప్లేయర్లు, కావాలని.. తమ టీమ్ ఓడిపోవాలని ఆడుతున్నట్టుగా ఆడుతున్నారు. ఇంకొందరు ప్లేయర్లు అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత మరింత సంతోషంగా కనిపిస్తున్నారు. మాజీ కెప్టెన్ రోహిత్‌కి టీమ్‌లో కొందరు ప్లేయర్లు వీరాభిమానులు. బుమ్రా, సూర్య, ఆకాశ్, తిలక్ వర్మ వంటి ప్లేయర్లకు రోహిత్ జిగిరీ దోస్త్.. వీళ్లు రోహిత్ కోసం ముంబై గెలవకుండా ఏం చేయాలో అది చేస్తున్నారు.
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..
హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం వల్ల చాలా పెద్ద తప్పు జరిగిందని ముంబై టీమ్ చాలా త్వరగానే గ్రహించింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై బౌలర్లు ఏకంగా 18 సిక్సర్లు, 19 ఫోర్లు ఇచ్చారు. బుమ్రా లేకుండా 2023 సీజన్ ఆడినప్పుడు కూడా ముంబై ఇంత ఘోరంగా ఆడలేదు. దీంతో తిరిగి రోహిత్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటోంది ముంబై.
అయితే ఇప్పుడు కెప్టెన్సీ మారిస్తే హార్ధిక్ గ్రూప్ నుంచి రియాక్షన్ రావచ్చు. తన పాటికి తాను గుజరాత్ టైటాన్స్‌లో కెప్టెన్సీ ఎంజాయ్ చేస్తుంటే, పిలిచి మరీ ఇలా అవమానించడాన్ని హార్ధిక్ ఊరుకోడు. అదీకాకుండా బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించి, ఇప్పుడు కెప్టెన్సీ తిరిగి తీసుకోమ్మంటే రోహిత్ ఒప్పుకుంటాడా? 5 సార్లు టైటిల్ గెలిచిన అంబానీ టీమ్‌కి, 2024 సీజన్ అష్టకష్టాలను తెచ్చి పెట్టేలా ఉంది.