Revanth Reddy : 2029లో సీఎంగా షర్మిల, పీఎంగా రాహుల్ గాంధీ..

Revanth Reddy
YS Sharmila, Revanth Reddy

Revanth Reddy : 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కనీస ఓటింగ్ శాతం కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. అయితే వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ పార్టీకి నాయకురాలిగా ఉన్నారు.. ‘వైఎస్‌ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..

‘తండ్రి పేరు మీద వ్యాపారం చేసేవాళ్లు కాదు, ప్రజల కోసం ఆయన ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేవారే నిజమైన వారసులు. ఈ విషయంలో షర్మిలకి నూటికి నూరు మార్కులు దక్కుతాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో బలోపేతం అవుతుంది. మేమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం.

Janasena Vs TDP : సీఎం రేస్ లో పవర్ స్టార్..

వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల గెలుస్తుందని మేం నమ్ముతున్నాం. అలాగే 2029లో ఇండియా ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారు.. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post