Razakar Movie Review : కొన్ని సినిమాలకు హైప్ రావాలంటే స్టార్ నటులు ఉండాలి. కానీ కొన్ని సినిమాలు కాన్సెప్ట్‌తోనే కావాల్సినంత హైప్ తెచ్చుకుంటాయి. నైజాం ఏరియాలో రజాకార్లు సాగించిన మారణ కాండను చూపిస్తూ సినిమా తెరకెక్కుతుందని తెలియగానే ‘రజాకార్’ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ట్రైలర్ తర్వాత ఆ హైప్ రెట్టింపు అయ్యింది. అనసూయ, బాబీ సిన్హా, ఇంద్రజ, ప్రేమ వంటి నటులు నటించిన ‘రజాకార్’ సినిమా మార్చి 15న విడుదలైంది.
Pawan Kalyan : పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ప్రత్యర్థిగా రామ్ గోపాల్ వర్మ..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలనే ప్రధాన కథాంశంగా తీసుకుని ‘రజాకార్’ సినిమాని తెరకెక్కించారు. హైదరాబాద్‌ని ఇస్లాం రాజ్యంగా చేయాలని అనుకున్న నైజాం నవాబు, మతమార్పిడి చేసేందుకు ఎలాంటి దారుణాలకు ఒడిగట్టాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. నటీనటుల నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఈ సినిమాలో చాలా సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి..
నిజం నవాబుగా మకరంద్ పాండే నటనతో పాటు బాబీ సిన్హా, ఇంద్రజ, ప్రేమ, ఖాసీం రజ్వీ, రాజ్ అర్జున్, వేదిక, అనసూయ అందరూ అద్భుతంగా నటించారు. చారిత్రక కథాంశాన్ని ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కించడంలో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యాడు..
రాసుకున్న సీన్స్‌కి భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మరో లెవెల్… సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ముస్లిం పార్టీలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది.
Anushka Shetty : శీలావతిగా మారిన అనుష్క శెట్టి..
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలనే ఈ ప్రయత్నం, కాస్త పబ్లిసిటీ చేస్తే నార్త్‌లో బాగా వర్కవుట్ అవ్వొచ్చు. ఇలాంటి చారిత్రక సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేది చాలా పెద్ద ప్రశ్నే. ఈ మూవీ సక్సెస్ అయితే ఇలాంటి మరుగునపడిన తెలంగాణ చరిత్ర కథలతో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.