Hanuman Movie : సంక్రాంతికి వచ్చి, ‘హనుమాన్’ మూవీతో పొంగల్ ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు ప్రశాంత్ వర్మ. మహేష్, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్లతో పోటీ పడుతుండడంతో అందరూ ప్రశాంత్ వర్మను తిట్టారు, ట్రోల్ చేశారు. అయితే కొన్ని సైకిల్ గుద్దితే బెంజ్ కారుకి కూడా బొక్క పడుతుందని చెప్పిన ప్రశాంత్ వర్మ, ఓ బెంజ్ కారును తుక్కుతుక్కుగా తొక్కేసి… మరో రెండు కార్లను తన సైకిల్‌తో ఓడించాడు.
Mahesh Babu : ఇష్టమైన థియేటర్ని కొనేసిన మహేష్ బాబు..
వరల్డ్ వైడ్ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ మూవీ, 50 రోజుల తర్వాత కూడా థియేటర్ల నుంచి షేర్ వసూలు చేస్తోంది. అయితే ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడు కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ అనుకున్నారంట. రూ.12 కోట్లతో అయిపోగొట్టి, రూ.50 కోట్ల వరకూ వసూళ్లు చేయొచ్చని ప్లాన్ చేశారట. అయితే సగం సినిమా అయ్యేసరికే బడ్జెట్ బౌండరీలు దాటేసింది. రూ.12 కోట్లు అనుకుంటే రూ.30 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది.
తెలుగులో మాత్రమే ఇంత మొత్తం వస్తుందో, లేదో అనే అనుమానంతో తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. టీజర్ రిలీజ్ అయ్యాక మిగిలిన భాషాల నుంచి డిమాండ్ పెరగడంతో కచ్ఛితంగా రూ.100 కోట్లు వసూలు చేస్తామని నమ్మకం పెరిగిందట ప్రశాంత్ వర్మకు. అనుకున్న దాని కంటే వేగంగా మొదటి వారంలోనే రూ.100 కోట్లు దాటేసిన హనుమాన్, ఓవరాల్‌గా రూ.320 కోట్ల దాకా వసూళ్లు సాధించి.. భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?