Ratha Saptami 2024 : మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు.
రథ సప్తమి నాడు నదీ స్నానానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అలా కుదరని వాళ్ళు..
Ratha Sapthami 2024 : రథసప్తమి అంటే ఏమిటి, ఎందుకు..?
రథసప్తమి ముందు రోజే జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి. అలాగే చిక్కుడుకాయలను కూడా తెచ్చుకోవాలి. రథసప్తమి రోజున నెత్తిమీద కొంచెం నూనె పెట్టుకోవాలి స్నానం చేసేటప్పుడు తల మీద ఒక జిల్లేడు ఆకు రెండు భుజాల మీద జిల్లేడు ఆకులు పెట్టుకొని.. ఓం ఆదిత్యాయనమః అని 11 సార్లు చదువుకొని తల మీద నుండి స్నానం చేయాలి.
దాని తర్వాత పూజ మందిరంలో ముందు రోజు పూలను తీసేసి శుభ్రం చేసుకుని సువాసన కలిగిన పూలను పెట్టి ధూపం దీపం వెలిగించి, అలాగే తులసి దగ్గర దీపం వెలిగించి మరియు ఇంటి ముందు రెండు దీపాలు కచ్చితంగా పెట్టాలి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యునికి.. ఓం సూర్యనారాయణ మూర్తి నమః అని 11 సార్లు చదువుకొని నీటిని వదలాలి.
Jeevitha rajeshekar:ఇప్పుడు జీవిత, అప్పట్లో విజయనిర్మల… డైరెక్షన్ చేసి, భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసి…
అలాగే ఆరోజు కచ్చితంగా “ఆదిత్య హృదయం” చదవాలి. అలాగే ఆవు పేడతో చేసిన పిడకలతో ఆవు పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి. అలా కుదరని వాళ్లు ఒక పిడకని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దానిపైన ఒక కొత్త మట్టి పాత్రను పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగిన తర్వాత అందులో బియ్యం వేసి పరమాన్నం చేయాలి. దాన్ని తర్వాత చిక్కుడుకాయలతో సూర్యుని రథం చేసి సూర్యుడికి ప్రసాదంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.