Rashmika Gautam : మహేష్ సినిమాలో ఛాన్స్… రూమర్లపై రష్మి గౌతమ్ రియాక్షన్..

Rashmika Gautam : మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూర్ కారం’ మూవీకి బీభత్సమైన నెగిటివ్ టాక్ వచ్చినా, పండగ సీజన్, బాబు ఇమేజ్ తోడు కావడంతో బాగానే వసూళ్లు రాబట్టింది. మొత్తంగా 95 శాతం వసూలు చేసిన గుంటూర్ కారం, క్లీన్ హిట్టుకి కాస్త దూరంలో ఆగింది. ఈ మూవీలో ‘ఏం రసిక రాజువో మరి’ అంటూ వచ్చే మాస్ సాంగ్‌లో నటి పూర్ణ, అలా వచ్చి మెరిసింది.

Indore Beggar : 40 రోజులు అడుక్కుని రూ.2.5 లక్షల సంపాదన..

పూర్ణ వేసిన స్టెప్స్‌కి విజిల్స్ పడ్డాయి. నిజానికి ఈ చిన్న రోల్ కోసం ముందుగా రష్మీ గౌతమ్‌ని అనుకున్నారని, అయితే రష్మీ, ఆ బిట్ చేయనని రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ పూర్ణకి వెళ్లిందని ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత ఏడాది చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీలో ఇలాగే ఓ చిన్న రోల్ చేసింది రష్మీ గౌతమ్. ఆ మూవీపైన వచ్చిన ట్రోల్స్ కారణంగా రష్మీ బాగా ఫీలైందని అంటున్నారు..

అయితే రష్మీ గౌతమ్, కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో చేసి ఉంటే, ఆమెకి మరిన్ని ఆఫర్లు వచ్చి ఉండేవి. శ్రీమంతుడు సినిమాలో అలా మెరిసి, ఇలా మాయమైన పూర్ణ, గుంటూర్ కారంలో తన స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ని ఫిదా చేసేసింది. ఈ రూమర్లపై రష్మీ స్పందించింది. మహేష్ సినిమాలో కనిపించే ఆఫర్ వస్తే, కచ్చితంగా ఓకే చేసేదాన్ని, ఎందుకు రిజెక్ట్ చేస్తాను.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేసింది రష్మీ గౌతమ్…

జనవరి 12న విడుదలైన ‘గుంటూర్ కారం’ మూవీ, ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో రెస్పాన్స్ బాగానే ఉన్నా, మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్‌పైన ట్రోల్స్ వస్తున్నాయి..

Harihara Veeramallu : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీమ్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post