Ram Charan Birthday Special : వినయ విధేయ రాముడు..

Ram Charan Birthday Special : రామ్ చరణ్ అంటే.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు, కానీ ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని ప్రపంచమంతా గుర్తించే స్థాయికి ఎదిగాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కేవలం మెగాస్టార్ కు ఉన్న ఎవరెస్టు లాంటి ఇమేజ్ కు మాత్రమే వారసుడిగా కాకుండా.. తండ్రిలోని వినయం, విధేయత, కష్టించే తత్వం, కుటుంబ బాధ్యత, అభిమానులపై ప్రేమ, ఎదుటివారికి ఇచ్చే గౌరవం, పనిని దైవంగా భావించే గుణం.. ఇలా ప్రతి విషయంలోనూ చిరంజీవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు చెర్రీ.

చరణ్.. 1985 మార్చి 27న మద్రాస్ లో జన్మించాడు. రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి కార్లంటే పిచ్చి. ఇంటర్ చదువుతున్నప్పుడు క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. డిగ్రీ అనంతరం చెర్రీ లండన్ లో 1 ఇయర్, ముంబైలో 6 నెలలు యాక్టింగ్ కోర్స్ చేసాడు. 2007 లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చిరుత మూవీతో చిరుతలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చాడు మెగా పవర్ స్టార్.

Ram Charan : గేమ్ ఛేంజర్‌లో ముగ్గురు విలన్లు! శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

చిరుత యావరేజ్ గా ఆడినప్పటికీ నటుడిగా మంచి మార్కులే సంపాదించాడు.  నెక్స్ట్ మూవీ దర్శకధీరుడు జక్కన్నతో మగధీర చేసి ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ కొంత నిరూత్సాహ పరిచినా కెరీర్ ప్రారంభంలోనే విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించాడు చరణ్. అయితే ఆ తర్వాత వచ్చిన రచ్చ, తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ వంటి వరుస పరాజయాలు ఎదురవడంతో నెపోటిజం, యాక్టింగ్, డాన్స్, ఫేస్ కట్ సరిగా లేదంటూ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు చరణ్.

అయితే ధ్రువతో తన నటనలో మరోకోణాన్ని చూపించాడు చరణ్. అప్పటి వరకు విమర్శించిన వాళ్ళు సైతం చరణ్ నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇక  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో చాన్నాళ్ల తర్వాత 100డేస్ ఆడిన మూవీ రంగస్థలం. చిరంజీవికి గ్యాంగ్ లీడర్ లా, రంగస్థలం రామ్ చరణ్ కు ఓ ల్యాండ్ మార్క్ అయింది.

“నువ్వు రాసిన ప్రతి అక్షరాన్ని తిప్పి రాసేలా చేస్తాను” అని తుఫాన్ లో ఓ డైలాగ్ ఉంటుంది. దాన్ని అక్షరాలా నిజం చేసాడు చరణ్. ఏ బాలీవుడ్ విమర్శకులు, మీడియా అయితే  విమర్శించారో అక్కడే ఇండియన్ సూపర్ స్టార్ అనేలా చేశాడు. ఇటీవల వచ్చిన RRR లో తన నటన, ఆహార్యంతో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం కూడా చూరగొన్నాడు. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ సైతం రామ్ క్యారెక్టర్ ను అద్భుతంగా డ్రైవ్ చేశాడంటూ ప్రశంసించాడు.

Ram Charan : రామ్ చరణ్‌ని అవమానించిన షారుక్ ఖాన్..!

ఇవన్నీ చరణ్ కు సంతోషాన్ని ఇచ్చేవే.. కానీ మున్ముందు ఇవన్నీ మోయలేనంత బరువు.. అంతకు మించిన బాధ్యత. అయినా వీటన్నిటిని చరణ్ నల్లేరు మీద నడకలా భావించి ముందుకు సాగాలని ఆశిద్దాం.. మన తెలుగువాడిగా కాకుండా ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన చరణ్ ను “భారతీయుడిగా గౌరవించి ” గర్వపడదాం… రామ్ చరణ్ పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యులకు లేదా అభిమానులకి పండగల కాకుండా యావత్ దేశం పండగల చేసుకునేలా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post