Raghu Rama Krishnam Raju : గత నాలుగున్నరేళ్లుగా అధికార వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఆ ప్రభుత్వ అరాచక పాలననీ, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకృత్యాలను నిత్యం ఎండగడుతూ స్వపక్షంలోనే విపక్షంగా మారి ప్రభుత్వం మీద పోరాటం చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకుండా తీవ్ర నిరాశ పరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దశలో టీడీపీ నుండి విజయనగరం పార్లమెంట్ పరిధిలో రఘురామ రాజుని ఎంపీగా బరిలోకి దింపే అంశంపై చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.
AP Politics : మూడు పార్టీలు, మూడు క్యాపిటల్స్.. రాజధాని రాజకీయం..
విజయనగరం నుంచి వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గత విజయనగరం నుండి ఎంపీగా గతంలో గెలిచి ఉన్నారు. రఘురామ రాజు గారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం వల్ల క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉండటం వలన.. రఘురామరాజు గారికి టిడిపి నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. మొదట విజయనగరం నుండి ఏపీ టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు ఇప్పటి వరకు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీని బిజెపికి కేటాయించారు.
దీంతో కళా వెంకట్రావు పార్లమెంటుకు పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. కానీ కళా వెంకట్రావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారి కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు చంద్రబాబు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో నర్సాపురం నుండి టికెట్ రాని రఘురామరాజుని విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది.