Rajamouli : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘శివ’, తెలుగు సినీ చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్. అప్పటి దాకా తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, కుటుంబంలో తగాదాలు, పగలు, ప్రతీకారాల చుట్టే తెలుగు సినిమాలన్నీ తిరుగుతూ ఉండేవి. ఆర్జీవీ ఈ పంథాని మార్చాడు. అప్పటికి ఏడాదికి 20-30 సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్న బ్రహ్మానందం ‘శివ’ సినిమాలో నటించలేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘పెదరాయుడు’, బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహా రెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’, ఎన్టీఆర్ ‘సింహాద్రి’, మహేష్ బాబు ‘పోకిరి’, రామ్ చరణ్ ‘మగధీర’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలన్నింటిలో కామన్ విషయం బ్రహ్మీయే… ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన ప్రతీ సినిమాలో బ్రహ్మానందం నటించాడు..
SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..
ఈ రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డు లిఖించడమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్‌ని ఖండాంతరాలు దాటించింది ‘ బాహుబలి’. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం నటించలేదు. తొలుత బ్రహ్మీ కోసం జక్కన్న ఓ పాత్ర అనుకున్నా, ఆయన డేట్స్ ఇష్యూ కారణంగా ‘బాహుబలి’లో ఆయన కనిపించలేదు. ఓ రకంగా రామ్ గోపాల్ వర్మ తర్వాత బ్రహ్మానందం లేకుండా సినిమా తీసి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన దర్శకుడిగా నిలిచాడు ఎస్.ఎస్. రాజమౌళి..