Rahul Dravid : విజయాన్ని అందుకోవడం చాలా కష్టం.. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ! ఓడిపోవడం చాలా తేలిక. ఓటమిని ఎదుర్కోవడమే చాలా కష్టం. అందుకే ఓడిపోయిన తర్వాత దాన్ని ఫేస్ చేయలేక ముఖం చాటేస్తూ ఉంటారు చాలా మంది. ఓటమిని ఫేస్ చేయడానికి ఎప్పుడూ వెనకాడని వారిలో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ ఉంటారు..
2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్స్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ రాలేదు. అతని స్థానంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. ఆ రెండు టోర్నీల్లో భారత జట్టు ఓటమికి బాధ్యత వహించాడు, ఎన్నో ఓటములు ఫేస్ చేశాడు. ఓటమిని ఫేస్ చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మను పంపాడు. విజయం తర్వాత ప్రశ్నలు, అవమానాలు ఏమీ ఉండవు. ఉండేది కేవలం విషెస్ మాత్రమే..
Most Memorable Month 2024 : జూన్ నెల మరిచిపోలేమంతే..
నిజానికి రాహుల్ ద్రావిడ్‌కి, సచిన్ టెండూల్కర్‌కి ఉన్నంత క్రేజ్ లేదు, సచిన్ టెండూల్కర్‌కి ఇచ్చినన్ని అవకాశాలు రాలేదు. సెలబ్రిటీ కల్చర్‌ని ఏ మాత్రం ఇష్టపడని గ్రెగ్ ఛాపెల్, కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్‌ని సెలక్ట్ చేసుకున్నాడు. సౌరవ్ గంగూలీ, టీమ్‌లో తన గ్రూపుని నింపేసిన సమయంలో కోచ్‌గా వచ్చిన ద్రావిడ్, టీమ్‌కి కొన్ని నెవర్ బిహేర్ నెవర్ అగైన్ విజయాలు అందించాడు..
2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ ఎమోషనల్ అయ్యాడు. దాదాపు ఏడ్చేసినంత పని చేశాడు. దీనికి కారణం కెప్టెన్‌గా 2007 వన్డే వరల్డ్ కప్ పరాభవం. 2003లో గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్‌కి వెళ్లిన భారత జట్టు, హాట్ ఫెవరెట్‌గా 2007 వన్డే వరల్డ్ కప్ ఆడింది. కానీ బంగ్లాతో మ్యాచ్ చిత్తుగా ఓడింది. ఆ ఓటమి, టీమిండియాపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించింది..
ఎంతగా అంటే రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, ధోనీ, యువరాజ్ వంటి ప్లేయర్ల ఇళ్లపై అభిమానులు దాడులు చేశారు, వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ అవమానంతో సీనియర్లు, టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడేందుకు కూడా ఇష్టపడలేదు. ఎన్నో అవమానాలు, తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడు రాహుల్ ద్రావిడ్..
2007 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాడు సచిన్ టెండూల్కర్. తన కెరీర్‌కి ఘనమైన ముగింపు దక్కించుకున్నాడు. ద్రావిడ్‌కి అలాంటి ఛాన్స్ దక్కలేదు. సచిన్ ఆడినా, ఆడకపోయినా అతన్ని టచ్ చేయడానికి బీసీసీఐ భయపడేది. కానీ రాహుల్ ద్రావిడ్‌కి అలాంటి సౌఖ్యం దొరకలేదు..
కెప్టెన్‌గా సాధించలేకపోయిన హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ అద్భుతమైన సక్సెస్ సాధించాడు. అండర్19 టీమ్‌కి సూపర్ సక్సెస్ అందించాడు రాహుల్ ద్రావిడ్. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కారణంగా టీమ్‌లో గ్రూపిజం పెరిగి, ఐసీసీ టోర్నీల్లో సక్సెస్ సాధించలేకపోతుండడాన్ని గమనించి, రాహుల్ ద్రావిడ్‌ని టీమిండియా హెడ్ కోచ్‌గా తీసుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్. ద్రావిడ్ కోచ్ అయ్యాక ఎన్నో అవమానాలు ఫేస్ చేశాడు. అయితే అన్నింటికీ సమాధానం చెప్పి, కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. భారత క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్ ఓ లెజెండ్…