Raayan Movie Review : ధనుష్ హీరోగా నటించిన 50వ సినిమా ‘రాయన్’. ఇప్పటికే డైరెక్టర్‌గా ‘పా పాండి’ అనే సినిమా చేసిన ధనుష్, తన 50వ సినిమా కోసం 14 ఏళ్ల క్రితమే కథ రాసుకుని సిద్ధం చేసుకున్నాడట. ప్రస్తుతం తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్న ధనుష్, 50వ సినిమా ‘రాయన్’, జూలై 26న విడుదలైంది.
‘రాయన్’సినిమా కోసం సింపుల్‌గా ఓ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాని ఎంచుకున్నాడు ధనుష్. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఇద్దరు తమ్ముళ్లు, ఓ చెల్లి బాధ్యతను తీసుకుంటాడు ధనుష్. వాళ్ల కోసం కష్టపడుతూ ఉంటాడు. అయితే వీరి అందమైన కుటుంబం, కొందరి కారణంగా ఛిన్నాభిన్నం అవుతుంది. దీంతో తమ్ముళ్లతో కలిసి తన కుటుంబాన్ని నాశనం చేసినవారిపై రాయన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు? ఇదే ఈ సినిమా కథ..
Dhanush Kubera : అండర్ వరల్డ్‌ని శాసించే బిక్షగాడి కథతో కుబేరా..
కథ సింపుల్ అయినా టేకింగ్, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు ధనుష్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు. యాక్షన్ సీన్స్ కారణంగానే ఈ సినిమాకి A సర్టిఫికెట్ వచ్చింది. కథ పాతదే అయినా ఎమోషన్స్ పండించడంలోనూ సక్సెస్ అయ్యాడు ధనుష్..
ముఖ్యంగా చెల్లెలు తుషార, తమ్ముడు సందీప్ కిషన్, అతని ప్రియురాలు అపర్ణ మధ్య సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. విలన్‌గా మారిన ఎస్.జె. సూర్య వరుసగా హిట్లు కొడుతూ సాగుతున్నాడు. ఆయన సక్సస్ ట్రాక్ రాయన్‌కి కూడా ఉపయోగపడినట్టే.. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రాయన్ సినిమాని మరో ఎత్తుకి తీసుకెళ్లాయి..
Nagarjuna – Puri Jagannath : నాగర్జునని లైన్‌లో పెడుతున్న పూరీ.. హ్యాట్రిక్ కొడుతున్నామంటూ..
కొత్తదనం కోసం చూడకుండా కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి రాయన్ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్, యాక్షన్ లవర్స్‌కి ఐ ఫీస్ట్.. దర్శకుడిగా, నటుడిగా ధనుష్ హిట్టు కొట్టినట్టే..