Producer Gnanavel Raja : తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్, ఫాలోయింగ్, క్రేజ్ అన్నీ ఉంటాయి. సూర్య, కార్తీ, రజినీకాంత్, విజయ్, విక్రమ్, విజయ్ ఆంటోనీ సినిమాలకు తెలుగులో మంచి వసూళ్లు వస్తాయి. సూర్య ‘24’ తమిళ్‌లో వచ్చిన వసూళ్ల కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. కార్తీ ‘ఆవారా’, ‘యుగానికి ఒక్కడు’ సినిమాలు, తమిళ్‌లో అట్టర్ ఫ్లాప్ అయితే తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. అయితే తెలుగు హీరోలకు తమిళ్‌లో అస్సలు మార్కెట్ రాలేదు. ఎంత ప్రయత్నించినా మన సినిమాలు అక్కడ ఆడడం లేదు.
దీనిపై తాజాగా తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా రియాక్ట్ అయ్యాడు. ‘తెలుగు ఆడియెన్స్, మీడియా వాళ్లు తమిళ నటులను మన విజయ్, మన అజిత్, మన సూర్య, మన విక్రమ్ అని పిలుస్తారు. వాళ్లు తమిళ హీరోలను సొంతవాళ్లుగా చూస్తారు.కానీ తమిళ్ ఆడియెన్స్ మాత్రం అలా చూడరు.. తెలుగు హీరోలను వాళ్లు అని పిలుస్తారు.. ఇది ఎప్పటికీ మారదు.. ఎందుకంటే తమిళ హీరోల అభిమానులకు విపరీతమైన అభద్రతా భావం…
Tollywood vs Kollywood : పిచ్చి, వెర్రి, అంతకుమించి.. సోషల్ మీడియాలో టాలీవుడ్ vs కోలీవుడ్ రచ్చ..
ఈ కారణంగానే తమిళ్‌లో పాన్ ఇండియా హీరోలు లేరు. తెలుగులో ప్రభాస్‌కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇప్పుడు మహేష్ బాబు కూడా అక్కడ పాన్ ఇండియా స్టార్లుగా మారారు. మరి మన హీరోల పరిస్థితి ఏంటి? విజయ్, అజిత్ క్రేజ్ అంతా తమిళనాడు వరకే.. నార్త్‌లో వాళ్ల పేర్లు కూడా ఎవ్వరికీ తెలీదు..’ అంటూ మాట్లాడడు నిర్మాత జ్ఞానవేల్ రాజా.. సూర్య చేస్తున్న ‘కంగువా’, విక్రమ్ చేస్తున్న ‘తంగలాన్’ సినిమాలకు నిర్మాత జ్ఞానవేల్ రాజాయే..