Pimple Tips : మొటిమలు ఈమధ్య వయసు సంబంధం లేకుండా వస్తూ పెద్ద సమస్యలా అయ్యింది. ఈ మొటిమలు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వారికి మొటిమలు అధికంగా వస్తాయి. మొటిమలు రాకుండా మందు జాగ్రత్తగా ఉండండి అంటే ఆయిల్ ఫుడ్ కి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
మొటిమలు రావడానికి మొఖంపై ఉండే బ్యాక్టీరియా కూడా ఒక కారణం. అందువల్ల రోజుకి కనీసం మూడుసార్లైనా మొహం శుభ్రంగా కడుక్కోవాలి. శారీరిక వ్యాయామం (వాకింగ్, స్కిప్పింగ్ ) లాంటివి చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
ముత్యమంతా పసుపు.. ముఖమెంతో ఛాయా..
మొటిమలు చేత్తో లేదా పిన్నీసు, గుండు సూది లాంటి వాటితో తొలగించేందుకు ప్రయత్నం చేయకూడదు. ఇది చాలా సందర్భాల్లో ప్రమాదకరంగా అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్లు బాగా తాగడం, మాంసాహారం తగ్గించడం వల్ల కూడా మొటిమలు రాకుండా నివారించవచ్చు.
అలాగే ముఖానికి ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసినా దానికి ముందు సన్ స్క్రీన్ రాయడం వల్ల మీ స్కిన్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది దానివల్ల మొటిమలు రావడం కూడా తగ్గుతాయి. టమాటా రసం, నిమ్మరసం, కొంచెం తేనే కలిపి స్నానానికి 15 నిమిషాలు ముందు అప్లై చేసుకుని తర్వాత స్నానం చేస్తే మొటిమలు తగ్గుతాయి.